Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
సినిమానా...అది సిగ్గుచేటు పని: సానియా మీర్జా
కేవలం మీడియాలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా నా వ్యక్తిగత జీవితాన్ని తెరకెక్కిస్తే అది సిగ్గుచేటైన పనే' అని సానియా మీర్జా వ్యాఖ్యానించింది. రీసెంట్ గా పెళ్ళాడిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యక్తిగత జీవితంపై 'హైదరాబాదీ దామాద్' అని ముంబైలో ఓ చిత్రం తీస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న సానియా మీర్జా మండిపడుతూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె మాటల్లోనే...నా వ్యక్తిగత జీవితం ఆధారంగా సినిమా తీయడమనేది అసంబద్ధమైన పని. న్యూస్ పేపర్లో ఈ వార్తలు చదివి ఆశ్చర్యపోయాను. ఇప్పటిదాకా దర్శకుడు గానీ, ఇతర సిబ్బంది గానీ నన్ను సంప్రదించలేదు అంది.
ఇక ఈ చిత్రం టైటిల్ 'హైదరాబాదీ దామాద్' అంటే హైదరాబాద్ అల్లుడు అని అర్థం. ఈ పేరుతో హిందీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పెళ్లి వివాదం, మీడియా హడావుడి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే రిలాక్సవుతున్న సానియా ఈ సినిమా వార్తలను పేపర్లో చదివి అవాక్కయింది. కనీసం తనను సంప్రదించకుండానే, తన గురించి తెలుసుకోకుండానే వారు ఆ సినిమాకు సిద్ధపడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ వార్తను ప్రచురించిన ముంబై మిర్రర్ దినపత్రిక కథనం ప్రకారం..అమర్ ఉపాధ్యాయ్, అలీ మర్చంట్, టీవీ స్టార్ డెబినా బెనర్జీలు ప్రధాన తారాగణంగా 'హైదరాబాదీ దామాద్' సినిమా నిర్మాణం మొదలైంది. చిన్ననాటి మిత్రుడు సొహ్రాబ్తో జరగాల్సిన సానియా పెళ్లి రద్దు కావడం, క్రికెటర్ షోయబ్ మాలిక్ తో వివాహం వివాదాస్పదం కావడం వంటి కీలక సంఘటనలన్నీ ఈ సినిమాలో ఉంటాయి అని తెలుస్తోంది.