»   »  సానియాపై మనుసు పడుతున్న షాహిద్!

సానియాపై మనుసు పడుతున్న షాహిద్!

Posted By:
Subscribe to Filmibeat Telugu


కరీనా కపూర్ తో బెడిసినప్పటినుంచి షాహిద్ కపూర్ పరిస్థితి మరింత మెరుగు పడింది. కరీనాతో లింక్ ఉన్నన్నాళ్లు వేరే అమ్మాయి దిక్కు చూడలేకపోయిన షాహిద్ కపూర్ ఇపుడు ఎంచక్కా అందరివైపు చూస్తూ అందాలను అస్వాదిస్తున్నాడట. అందుకే ఇపుడు షాహిద్ తో రోజుకో అమ్మాయిని లింక్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు.

మొన్నటిదాకా విద్యా బాలన్, ఆ తరువాత అమృతారావు అన్న జనాలు ఇపుడు మరో కొత్త పేరును లింక్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు మన హైదరాబాద్ అమ్మాయే. టెన్నస్ స్టార్ సానియా మీర్జా కావడం విశేషం. సానియా మీర్జాను లైన్ లో పెట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. నిజమో కాదో తెలియదు కానీ సానియా మీర్జా మాత్రం భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన కొన్ని మ్యాచ్ లను వీక్షించింది. పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సానియా కోసం తెగ ఆరాట పడ్డాడు కూడా. అంతా మాయ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X