‘సంజన చెప్పు సంజన’- అంబటిపై సినిమానా?

ఫిల్మ్ నగర్ నుంచి విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై వెల్లువెత్తిన సెక్సు ఆరోపణల నేపథ్యంలో ఓ వ్యక్తి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడట. అంబటి రాంబాబుపై ఓ టీవీ ఛానల్ లో కథనం ప్రసారమైన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబుపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంతో తెలియదు కానీ, ఈ సంఘటన మూలంగా సినిమా వాళ్లకి ఓ కొత్త కథ దొరికినట్లయింది. మరి ఆ టైటిల్ సినిమా రూపంలోకి వస్తే గానీ అసలు ఇది అంబటి రాంబాబును ఉద్దేశించి రిజిస్టర్ చేసిందా? లేక ఇవన్నీ ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న గాలి వార్తలా? అనే విషయం తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











