twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సంజన చెప్పు సంజన’- అంబటిపై సినిమానా?

    By Bojja Kumar
    |

    Ambati Rambabu
    అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్క పిల్ల కాదేదీ కవితకు అనర్హం అని ఓ మహా కవి చెప్పనట్లు.....కాదేదీ సినిమా తీయడానికి అనర్హం అంటూ ముందుకొస్తున్నారు సినిమా వాళ్లు. క్రియేటివిటీకి సినిమా ఇండస్ట్రీ పెట్టింది పేరు. సినిమాలు తీయడానికి వీరు ఎంచుకునే సబ్జెక్టు, ఆ సినిమాలకు వాళ్లు పెట్టే టైటిళ్లు ఒక్కోసారి ఆసక్తికరంగాను, ఒక్కోసారి ఫన్నీగాను, ఓక్కోసారి ఓవర్ గాను అనిపిస్తాయి. ఇలా క్రియేటివిటీ ఉన్న వాళ్లంతా తమ బుర్రలో ఆలోచన మెదిలిందే ఆలస్యం...వెంటనే దాన్ని ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయిస్తూ ఉంటారు. తాజా ఓ వ్యక్తి రిజిస్టర్ చేయించిన సినిమా టైటిల్ ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఆ సినిమా టైటిల్ పేరు 'సంజన చెప్పు సంజన".

    ఫిల్మ్ నగర్ నుంచి విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై వెల్లువెత్తిన సెక్సు ఆరోపణల నేపథ్యంలో ఓ వ్యక్తి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడట. అంబటి రాంబాబుపై ఓ టీవీ ఛానల్ లో కథనం ప్రసారమైన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబుపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంతో తెలియదు కానీ, ఈ సంఘటన మూలంగా సినిమా వాళ్లకి ఓ కొత్త కథ దొరికినట్లయింది. మరి ఆ టైటిల్ సినిమా రూపంలోకి వస్తే గానీ అసలు ఇది అంబటి రాంబాబును ఉద్దేశించి రిజిస్టర్ చేసిందా? లేక ఇవన్నీ ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న గాలి వార్తలా? అనే విషయం తెలుస్తుంది.

    English summary
    It is heard that one title has caught the attention of many. This is ‘Sanjana Cheppu Sanjana’. Well, the person who registered this title has taken inspiration from the recent telephone sex scandal involving Ambati Rambabu. While the mystery continues whether the husky voice belonged to Rambabu or not the dialogue sure became a hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X