For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోయిన్లు డ్రమ్ముల్లా తయారయ్యారు: సంజన

  By Bojja Kumar
  |
  Actress Sanjana Talks About Her New Movie

  దాదాపు పదేళ్ల క్రితం 'బుజ్జిగాడు' సినిమాతో సెకండ్ హీరోయిన్‌గా తెలుగులో కెరీర్ ప్రారంభించిన బెంగుళూరు బ్యూటీ సంజన ఆ తర్వాత హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే స్థాయిలో మంచి క్యారెక్టర్ పడకపోవడం కూడా ఇందుకు కారణం అయుండొచ్చు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో సంజనకు ఇలాంటి ప్రశ్నే ఎదురవ్వగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు తాను చేస్తున్న 'స్వర్ణ ఖడ్గం' గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

  అందుకే నాకు ఇక్కడ గుర్తింపు రాలేదు

  అందుకే నాకు ఇక్కడ గుర్తింపు రాలేదు

  నేను ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్, గాడ్ పాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగులో కంటే కన్నడలో ఎక్కువ గుర్తింపు వచ్చింది. అందులోనూ నేను బెంగుళూరు అమ్మాయిని కావడం బాగా కలిసొచ్చింది. హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండక పోవడం కూడా తెలుగులో అవకాశాలు తక్కువ రావడానికి ఓ కారణం అని సంజన తెలిపారు. నేను బెంగుళూరు అమ్మాయిని కావడం, అక్కడే ఉంటుండటం వల్ల కన్నడ ఇండస్ట్రీలో పెద్ద అడ్వాంటేజ్ అయిందని తెలిపారు.

   ఆ హీరోయిన్లు డ్రమ్ముల్లా తయారయ్యారు

  ఆ హీరోయిన్లు డ్రమ్ముల్లా తయారయ్యారు

  నా కెరీర్లో ఇప్పటి వరకు 45 సినిమాల్లో నటించాను, మలయాళంలో సూపర్ స్టార్లతో కలిసి చేశాను. పదేళ్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాను. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇటీవలే సైన్ చేశాను. నాతో పాటు పదేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను ఇపుడు చూస్తే లావుగా డ్రమ్ముల్లా తయారయ్యారు, కొందరైతే ముగ్గురు నలుగురు పిల్లలను కనేశారు. పెళ్లి కాని వారు అవకాశాల్లేక డిప్రెషన్లోకి వెళ్లిపోయారు... అని సంజన అన్నారు.

  ఆ విషయంలో క్లారిటీ ఉంది

  ఆ విషయంలో క్లారిటీ ఉంది

  సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుంటే అందరూ దాన్ని పాజిటివ్‌గా తీసుకోలేరు. కొంత మంది ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. బుజ్జిగాడు సినిమాలో నేను సెకండ్ హీరోయిన్‌గా వచ్చి కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలోసర్వైవ్ అవుతున్నాను. నా గోల్ ఏమిటి? నేను ఫైనల్‌గా రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ఏమిటి అనే దానిపై నాకు క్లారిటీ ఉంది.... అని సంజన తెలిపారు.

  స్వర్ణ ఖడ్గం... సీరియల్‌ అనే మాట చిన్నపదం

  స్వర్ణ ఖడ్గం... సీరియల్‌ అనే మాట చిన్నపదం

  ప్రస్తుతం ‘స్వర్ణ ఖడ్గం' అనే సీరియల్‌లో చేస్తున్నాను. దాన్ని సీరియల్ అని పిలవడం చాలా చిన్న పదం అవుతుంది. ఇండియన్ టెలివిజన్ చరిత్రలో ఇదొక బిగ్గెస్ట్ షో. భారీ బడ్జెట్‌తో తీస్తున్న షో ... 24 నిమిషాలు(యాడ్స్‌తో కలిపి 30 నిమిషాలు) సాగే ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాహుబలి రెండు భాగాలు ఐదేళ్లు కష్టపడి చేశారు. ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ వదలుకోవడం ఇష్టం లేక అదే సెట్స్‌లో ఏదైనా చేయాలనే ఆలోచనతో నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ‘స్వర్ణ ఖడ్గం' నిర్మిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులో అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.... అని సంజన తెలిపారు.

  బాహుబలి ప్రభాస్‌కు ఫిమేల్ వెర్షన్‌

  బాహుబలి ప్రభాస్‌కు ఫిమేల్ వెర్షన్‌

  కానీ ‘స్వర్ణ ఖడ్గం' 150 నుండి 200 ఎపిసోడ్లు సాగుతుంది. దాదాపు సంవత్సరన్నర కాలం ప్రేక్షకులను నేను ఎంటర్టెన్ చేయబోతున్నాను. అందులోనూ యోధురాలైన మహారాణి పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర గురించి సింపుల్‌గా చెప్పాలంటే బాహుబలి ప్రభాస్‌ను ఫిమేల్ వెర్షన్‌గా చూపించడం. అంత హెవీ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందుకోసం చాలా కష్టపడాల్సి వస్తోంది అని సంజన తెలిపారు.

  English summary
  Actress Sanjana who was seen in a couple of Telugu films in the past is now coming up with a Telugu TV soup titled as Swarna Kadgam. he actress said that she has put on weight for the character she is playing in a TV serial.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X