'సమర్ధుడి'తో ప్రేమలో పడ్డ సంజన
తాజాగా బ్యూటీ హీరో రాజాతో కలిసి 'సమర్థుడు" లో నటించిన అందాల సుందరి సంజన రాజాతో ప్రేమాయణం కొనసాగిస్తున్న వార్తలపై స్పందిస్తూ రాజాతో ప్రేమా? అటువంటిది ఏమీ లేదని, ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడని, తనతో నటించే హీరోయిన్ల పై ఆయన శ్రధ్ధ తీసుకుంటాడని తెలిపింది. దీన్ని ఏవేబో ఊహించుకొని వార్తలు రాయడం సబబు కాదని తెలిపింది.
మళ్ళీ అవకాశం వస్తే రాజాతో నటించడానికి రెడీ అంటోంది. ఇంకేముంది? సంజన రాజాతో నటించాలనుకుంటే మాత్రమే సరిపోదు. రాజా సంజన కాంబినేషన్ లో సినిమా తీసే నిర్మాత కావాలి గదా. మొహానికి రంగులు పూసుకోవడం తనకు తగదని, విదేశీయుల లాగా సహజంగా ఉండటమే తనకు ఇష్టం అని తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











