twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరితో పనిచేస్తున్నందుకే ఆ పుకార్లు!!!

    By Staff
    |
    Sanjana
    ప్రభాస్-త్రిషా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా బుజ్జిగాడు-మేడిన్ చెన్నయ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సంజన రెండో హీరోయిన్ గా చేస్తోంది. గంద హెందతి అనే కన్నడ సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన సంజన తొలుత మోడల్ గా పనిచేసింది. ఆమెతో దట్స్ తెలుగు.కామ్ ఇంటర్వ్యూ.

    ప్ర-మీరు మోడల్లింగ్, సినిమాలలోకి ఎలా వచ్చారు

    సంజన-స్కూల్లో చదివేప్పుడే క్రీడలు బాగా ఆడేదాన్ని...అందుకే నా బాడీ అందంగా రూపుదిద్దుకుంది.. పియుసి చదివే రోజుల్లో మోడల్లింగ్ అవకాశాలు వచ్చాయి. పియుసి సెకండ్ ఇయర్ లో ఉండగానే తొలి మోడల్లింగ్ అవకాశం వచ్చింది. చదువుతూనే మోడల్లింగ్ చేసేదాన్ని.

    ప్ర-మరి సినిమాలలోకి ఎలా వచ్చారు.

    సంజన-కన్నడంలో గంద హెందతి నా తొలి సినిమా

    ప్ర-మోడల్లింగా లేక సినిమాలంటే ఇష్టమా.f

    సంజన-సినిమా అవకాశం వచ్చేనాటికే నేను 10 అడ్వర్టయిజ్ మెంట్లలో నటించాను..ఏది ఇష్టమంటే చెప్పలేను..ఫేమస్ కావాలనుకున్నాను...సంతోషం కావాలనుకున్నాను పొందుతున్నాను...ప్రస్తుతానికైతే నటనపై సీరియస్ గా దృష్టిపెట్టాను...ఇపుడేం చేస్తున్నానో తెలియదుకానీ వినోదం మాత్రం లభిస్తోంది... సినిమా సక్సెస్ అయితే నిర్మాత లాభాలు పొందుతాడు...దర్శకుడు సంతోషంగా ఉంటాడు.

    ప్ర-సినిమాల్లోకి వచ్చి ఇప్పటికెన్నేళ్లయింది.

    సంజన-ఒకటిన్నర సంవత్సరం అయిందంతే.

    ప్ర-ఏయే బ్రాండ్స్ కు మోడల్లింగ్ చేశారు..

    సంజన-ఇప్పటికి 60 అడ్వర్టయిజ్ మెంట్లలో నటించాను...తాజాగా జాన్ అబ్రహంతో కలిసి ఫాస్ట్ ట్రాక్ యాడ్ లో నటించా.

    ప్ర-తాజా ప్రాజెక్టులేమిటి

    సంజన-ప్రస్తుతం తెలుగు సినిమా ఒకటే చేతిలో ఉన్న ప్రాజెక్ట్...అది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న బుజ్జిగాడు సినిమా.

    ప్ర-ఇంకా ఏ సినిమాకైనా ఎంపికయ్యారా

    సంజన-చాలా అవకాశాలు వచ్చాయి...షూటింగ్ మొదలయినాకా చెబుతా...హర్రీబర్రీగా చెప్పను...

    ప్ర-పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అవకాశం గురించి...

    సంజన-పూరి సర్ ఫంటాస్టిక్ దర్శకుడు..పూరి సినిమాతో తెలుగులో తొలి అవకాశం వచ్చిందని చెబితే...అద్భుత అవకాశం అని అందరూ అంటున్నారు...ఈయన సాదాసీదాగా ఉండేవ్యక్తి...అంతేకాదు తొలి సినిమాలోనే ప్రభాస్ లాంటి సూపర్ హీరో సినిమాలో నటిస్తున్నా..

    ప్ర-ఆ సినిమా ఎపుడు విడుదల అవుతుంది

    సంజన-ఏప్రిల్,2008లో విడుదల అవనుంది...ఇప్పటికి రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తయ్యాయి.

    ప్ర-సినిమా కెరీర్ ను ఎప్పటినుంచి సీరియస్ గా తీసుకున్నారు..

    సంజన-గంద హెందతి సినిమా షూటింగప్పుడే చాలా వినోదంగా గడిపాను...సినిమా విడుదల అయ్యాక వచ్చిన ఫీడ్ బ్యాక్ బాగుంది...అపుడే ఇక సీరియస్ గా కెరీర్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను...ఉదయం పొద్దునే లేవడమంటే చాలా ఇష్టం..మేకప్ కు చాలా సమయాన్ని కేటాయిస్తాను...సినిమాలలో కెరీర్ కొనసాగిస్తానని చెప్పగానే నా తల్లితండ్రులు ఒప్పుకున్నారు...

    ప్ర-మీరు సినిమాలు అనగానే మీ ఫాదర్ ఒప్పుకోనట్టుంది..

    సంజన-అవును..ఏ తండ్రి మాత్రం తన కూతురు మంచి గురించి ఆలోచించరు...ఆ తరువాత ఆయన ఓకే చెప్పారు...చాలా సపోర్ట్ చేస్తున్నారు..

    ప్ర-మీ తల్లి కూడా సపోర్టివ్ గా ఉంటారా..

    సంజన-నా తల్లి చాలా మంచిది..ఆమె కూడా చాలా సపోర్టివ్.

    ప్ర-వేరే భాషలలో కూడా నటించాలనుకుంటున్నారా..

    సంజన-నాకు దక్షిణాది సినిమాలంటే ఇష్టం..ఉత్తరాదితో పోలిస్తే టెక్నికల్ గా దక్షిణాది సినిమాలు చాలా బావుంటాయి..అంతేకాదు ఇక్కడ సినిమా జనాలతో పనిచేయడం చాలా బావుంటుంది.

    ప్ర-కన్నడం కాకుండా తెలుగు, మలయాళం, తమిళ సినిమాల గురించి మీ అభిప్రాయం..

    సంజన-పాత్ర మంచిదైతే ఆలోచించేదేముంది...

    ప్ర-సినిమాలలో పనిచేయడానికి ప్రత్యేకంగా ఇష్టమైనవారెరన్నా ఉన్నారా...

    సంజన-చాలామంది ఉన్నారు..నటులు, దర్శకులు చాలా మంది ఉన్నారు...

    ప్ర-ప్రత్యేక పాత్రలేమైనా ఉన్నాయా

    సంజన-అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది...మంచిదై ఉండాలంతే.

    ప్ర-డాన్సర్ గా మీరు ఓకేనా

    సంజన-నేను మంచి డాన్సర్ను. డాన్సింగ్ లో శిక్షణ తీసుకున్నాను...సల్సా కూడా చేస్తా.

    ప్ర-నటన ఓకేనా

    సంజన-నటన విషయానికి వస్తే నా ప్రతిభ అంత బాగా లేదు..మరికొన్ని సినిమాలలో నటిస్తే అదే మెరుగవుతుందనుకుంటున్నాను..

    ప్ర-యాడ్ సినిమాలలో నటించడం-సినిమాలలో నటించడంలో తేడా ఏముంది.

    సంజన-అది పూర్తిగా నిజం కాదు...అన్ని యాడ్ ఫిల్మ్స్ ఒక్కరోజులో పూర్తయ్యేవి ఉండవు. సినిమాల కోసం నిర్ణీత సమయం దాకా పనిచేస్తాం...ఆ తరువాత ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాం...తెల్లారి షూటింగ్ కు ఫ్రెష్ గా వెళతాం..అదే యాడ్ సినిమాలైతే ఎక్కువశాతం లోకేషన్లు ఒక్కరోజు కోసమే బుక్ చేస్తారు..అక్కడే తేడా ఉంది...సినిమాకైతే తెల్లారి కూడా అనుకున్నట్టుగా సీన్ ను షూట్ చేసుకోవచ్చు. దర్శకుల వద్దకు వెళ్లి ఏ డైలాగును ఎలా చెప్పాలని పలుమార్లు అడిగి తెలుసుకోవచ్చు.

    ప్ర-పేరెందుకు మార్చుకున్నారు.

    సంజన-అర్చన పేరుతో ఇప్పటికే చాలామంది నటీమనులున్నారు...అందుకే మార్చుకున్నాను.

    ప్ర-పేరు ప్రతిష్టలంటే ఇష్టమా

    సంజన-అవును...వార్తల్లో నిలవాలని ఉంటుంది..

    ప్ర-ప్రేమ కోసం సమయం కేటాయించారా..

    సంజన-ఇప్పటికింకా నా వయసు నిండా 19దే..ముందు కెరీర్.

    ప్ర-పూరి జగన్నాథ్ తో లింక్ ఉన్నట్టు వస్తున్న పుకార్ల సంగతేమిటి

    సంజన-అవి పుకార్లు మాత్రమే...ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టే అవి పుట్టుకొస్తున్నాయి..ఇంకెవరితే పనిచేసినా ఇవే పుకార్లు వస్తాయి...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X