కోరిక తీర్చమన్నాడు... నిర్మాత బండారం బయటపెట్టిన సంజన!

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ సంజన, ఆమె ప్రస్తుతం నటిస్తున్న 'శివకేశవ్' చిత్ర నిర్మాతలకు మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఇటీవల ఆమెను చిత్రం ఆడియో ఫంక్షన్‌కు నిర్మాతలు ఆహ్వానించలేదు. దీని వెనక పెద్ద కాణమే ఉందనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాత హీరోయిన్ సంజనను 'అన్ ప్రొఫెషనల్ డిమాండ్స్ తీర్చాలని' కోరాడని, అందుకు ఆమె నిరాకరించడమే......అహ్వానించక పోవడానికి అసలు కారణం అని తెలుస్తోంది.

మరి నిర్మాత ఆమెను ఏం కోరిక కోరాడనే విషయం మాత్రం సంజన తన నోటితో బయట పెట్టడం లేదు. ఇండస్ట్రీ జనాలు మాత్రం నిర్మాత ఆమె ఆ....కోరిక కోరాడని గుసగుసలాడుకుంటున్నారు. ఆ...కోరిక ఏమిటో పాఠకులకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది. ఫిల్మ్ నగర్లో ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది.

సాధారణంగా సంజన షూటింగులకు తన తల్లితో కలిసి వస్తుంటుంది. అయితే నిర్మాతతో వ్యవహారం చెడిన తర్వాత.....తండ్రిని కూడా వెంట తీసుకుని వస్తోందట. తీన కోరికను తీర్చక పోగా తండ్రిని కూడా వెంట తీసుకుని రావడంతో నిర్మాతకు ఎక్కడో మండి ఆమెను ఆడియో ఫంక్షన్‌కు పిలవలేనది టాక్.

ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ...సంజన నిర్మాత వ్యవహారాన్ని పరోక్షంగా బయట పెట్టింది. 'కేవలం తమ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు.... పరిశ్రమలోని కొంత మంది దర్శకులు, నిర్మాతలు హీరోయిన్లు తమ సొంతమైనట్లు భావిస్తారు. పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నిర్మాతలు నా మేనేజర్ ద్వారా నా నుంచి ఏం డిమాండ్ చేసారో అర్థమైంది. కానీ నేను అలాంటి దాన్నికాదు. నాకు క్షమాపణలు చెప్పిన తర్వాత సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి ఒప్పుకుంటానన్నాను. ఈ సినిమా కోసం నేను ఎంతో కష్టపడి పని చేసాను' అని సంజన చెప్పుకొచ్చింది.

అయితే చిత్ర నిర్మాతలు మాత్రం సంజన ఆరోపణలను ఖండించారు. 'శివకేశవ్' చిత్ర నిర్మాత బి.నాగరాజు మాట్లాడుతూ.....'ఆడియో ఫంక్షన్‌కు అందరినీ ఆహ్వానించారా? లేదా? అనే విషయాలను చెక్ చేసుకోవడం నా డ్యూటీ కాదు. అందరినీ ఆహ్వానించాలని నా మేనేజర్‌కు చెప్పాను. ఆమెకు ఆహ్వానం అందలేదనే విషయం నాకు తెలియదు. ఆమె తను నటించిన చిత్రం సొంత చిత్రంగా భావిస్తే, ఎవరి ఆహ్వానం లేకున్నా హాజరయ్యేది. ఆమె చెబుతున్నట్లు 'అన్ ప్రొఫెషనల్ డిమాండ్స్' అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి' అని స్పష్టం చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X