తెరవెనుక యేం జరుగుతోందో గానీ తమన్నాకి మాత్రం అన్యాయమే మిగులుతోంది. నిజానికి 'శ్రీ' సినిమాతో ఈ అందం పరిచయమైనా శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్' తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో తమన్నాకి ఆఫర్స్ బాగానే వచ్చాయి. కానీ ఎందుకనో గానీ నిలబడటం లేదు. నిన్న 'ఆర్య 2' చేజార్చుకున్నట్లే ఇప్పుడు యమ్.యస్.రాజు ,బి.గోపాల్ కాంబినేషన్ ఫిల్మ్ 'జోష్' నుండి తప్పుకుంది. హన్సిక మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఇప్పుడా ప్లేసు లోకి సంజన వచ్చి చేరింది. బుజ్జిగాడు లో ఆమెని చూసి ఎంపికచేసుకున్నారు. కానీ తమన్నాకి ఒక ఊరట యేమిటంటే తమిళంలో బిజీ కావటమే...
Story first published: Sunday, July 12, 2026, 4:58 [IST]