'బిగ్ బాస్'కి వెళ్లి క్యారెక్టర్ స్పాయిల్ చేసుకున్నా అని ఫీల్ కావొద్దు.. సంజన సెన్సేషనల్ కామెంట్స్

ఎన్నో అవాంతరాలు, మరెన్నో వివాదాలు.. వీటన్నింటి దాటుకొని సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభమైంది బిగ్ బాస్ షో. సీజన్ 3కి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున, 15 మంది పార్టిసిపెంట్స్ గత ఆదివారం బిగ్ బాస్ షో ప్రారంభం రోజున బుల్లితెర ఆడియన్స్‌ని పలకరించారు. గత రెండు సీజన్లలో కంటే ఈ సీజన్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం, చర్చలు ముదరటం కారణంగా జనంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో బిగ్ బాస్ సీజన్ 2 కంటిస్టెంట్ సంజన బిగ్ బాస్ షో గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంతకీ ఆమె చెప్పిన సంగతులేంటి? వివారాల్లోకి పోతే..

బిగ్ బాస్ సీజన్ 2.. మొదటి వారమే ఎలిమినేట్

బిగ్ బాస్ సీజన్ 2.. మొదటి వారమే ఎలిమినేట్

నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 లో కంటిస్టెంట్ గా ఉన్న సంజన.. మొదటి వారమే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన ఎలిమినేషన్ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది సంజన. మళ్లీ ఇప్పుడు ఆ సంజనే బిగ్ బాస్ సీజన్ 3 గురించి తన అభిప్రాయాలు పంచుకుంది.

పార్టీస్‌లో అందరం ఛిల్ అవుతాం

పార్టీస్‌లో అందరం ఛిల్ అవుతాం

బిగ్ బాస్ అనుభవాల గురించి మాట్లాడిన సంజన.. ''బిగ్ బాస్ హౌస్‌లో ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా బయటకొచ్చాక అందరం ఒకటే.. పార్టీస్‌లో అందరం ఛిల్ అవుతాం. అందుకే హౌస్ లో ఉన్నా కూడా సొంత క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్ చూపించకూడనేది నా అభిప్రాయం'' అని చెప్పింది.

ఛీ.. నా క్యారెక్టర్ ఇదా అని ఫీల్ కావొద్దు.

ఛీ.. నా క్యారెక్టర్ ఇదా అని ఫీల్ కావొద్దు.

బిగ్ బాస్ హౌస్ లో తనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారని, వారు హౌస్ లోకి వెళ్లే ముందే తనను సంప్రదించారని చెప్పింది సంజన. అయితే వాళ్లకు తానొక్కటే చెప్పానని.. మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే ఉండండి.. అంతేకానీ యాక్టింగ్ చేయొద్దు. యాక్టింగ్ చేసి తీరా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక ఛీ.. నా క్యారెక్టర్ ఇదా అని ఫీల్ కావొద్దు. 'బిగ్ బాస్'కి వెళ్లి క్యారెక్టర్ స్పాయిల్ చేసుకున్నా అనుకోవద్దు అని చెప్పానని తెలిపింది సంజన.

బిగ్ బాస్ కాంట్రవర్సీలు.. రెస్పాన్స్

బిగ్ బాస్ కాంట్రవర్సీలు.. రెస్పాన్స్

బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందే ఎన్నో కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి కదా! మీ రెస్పాన్స్ ఏంటి? అనే ప్రశ్నకు బదులిచ్చిన సంజన.. బిగ్ బాస్ ఉంచాలా వద్దా అనేది ఆడియన్ పోల్స్ పెట్టి డిసైడ్ చేయాలని, గవర్నమెంట్ గానీ లేదా మీ లాంటి మీడియా వాళ్ళు గానీ ముందుకొచ్చి ఆడియన్ పోల్స్ పెట్టాలని పేర్కొంది.

బిగ్ బాస్‌లో కాస్టింగ్ కౌచ్.. గ్రూపిజం, ఫేవరేటిజం

బిగ్ బాస్‌లో కాస్టింగ్ కౌచ్.. గ్రూపిజం, ఫేవరేటిజం

బిగ్ బాస్‌లో గ్రూపిజం ఉంది, ఫేవరేటిజం ఉంది.. బిగ్ బాస్ లో వీళ్ళను ఉంచాలి.. వీళ్ళను తీసేయాలని ముందే డిసైడ్ చేస్తారు. అలాగే గత సీజన్ లో నాతో సహా ఇంకొందరిని తొందరగానే గెంటేయడం నాకు నచ్చలేదు అని పేర్కొంది. కాకపోతే బిగ్ బాస్‌లో కాస్టింగ్ కౌచ్ మాత్రం లేదని చెప్పింది సంజన.

బిగ్ బాస్ 3 గురించి

బిగ్ బాస్ 3 గురించి

బిగ్ బాస్ అనేది కేవలం ఎంటర్‌టైన్ షో మాత్రమే.. ఆ 24 గంటలు మేము బాగానే ఉంటాం. అందులో ఏవో కొన్ని క్లిప్పింగ్స్ చుపిస్తారంతే. అది జస్ట్ ఎంటర్‌టైన్. ఫన్‌గా ఉంటే నవ్వండి, ఏడుపొస్తే ఏడవండి.. అంతేకానీ హార్ట్ కావొద్దు, ఎమోషనల్ కావొద్దు. కంటిస్టెంట్లన్లపై ద్వేషం పెంచుకోవద్దు. వాళ్ళ బాధలు వాలు పడుతున్నారు. ట్రోల్స్ మాత్రం చేయకండి అని పేర్కొంది సంజన.

సీజన్ 3 లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు

సీజన్ 3 లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు

బిగ్ బాస్ సీజన్ 3 లో తనకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ వాళ్ళ పేర్లు మాత్రం చెప్పనని అంటోంది సంజన. నా స్నేహితులకు వాళ్లకి సపోర్ట్ చేస్తా. ఒక్కో మొబైల్ నుంచి 10..10 ఓట్లు వేస్తా. విన్నర్ ఎవరంటే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేము. విన్నింగ్ లూసింగ్ సెకండరీ.. కౌశల్ గెలిస్తే ఏమైంది.. నేను ఎలిమినేట్ అయితే ఏమైంది. ఆ 100 రోజులు ఛిల్ కావాలి అంతే అని చెప్పింది సంజన.

బిగ్ బాస్ 2 వల్ల ఒరిగిందేంటి..

బిగ్ బాస్ 2 వల్ల ఒరిగిందేంటి..

బిగ్ బాస్ 2 వల్ల తన లైఫ్ లో వచ్చిన మార్పేదీ లేదని చెప్పింది సంజన. ఈ షో తర్వాత మంచి జరగలేదు. చెడు జరగలేదు.. బిగ్ బాస్ వల్లే ఆఫర్లు రాలేదు.. ఆఫర్ల కోసం నేను బిగ్ బాస్ సంజనగా ఎవ్వరి వద్దకు వెళ్లడం లేదు అని చెప్పుకొచ్చింది సంజన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X