పూరీ జగన్నాధ్ ని మర్చిపోలేకే అలా మాట్లాడుతోంది
తొలి చిత్రం 'బుజ్జిగాడు' సమయంలోనే తెలుగు నేర్చుకొన్నా. పూరి జగన్నాథ్ దగ్గరుండి నాకు తెలుగు నేర్పించారు. ఇప్పుడు ఇంకా బాగా మాట్లాడుతున్నా. నా తర్వాతి తెలుగు సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నా అంటోంది సంజన.ప్రభాస్ హీరోగా చేసిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంతో పరిచయమైన ముద్దుగుమ్మ సంజన. ఆమె తాజా చిత్రం దుశ్శాసన త్వరలో రిలీజ్ కాబోతోంది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.అంతేగాక..బుజ్జిగాడు, సత్యమేవ జయతే... చిత్రాలు తెలుగులో నాకంటూ ఓ గుర్తింపునిచ్చాయి. ఆ తరవాత కూడా పలు అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో నేను కన్నడంలో చిత్రాలు అంగీకరించాను. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో 'క్యాసినోవా' అనే చిత్రంలో నటిస్తున్నాను. 'దుశ్శాసన' తర్వాత తెలుగులోనూ మరిన్ని మంచి చిత్రాలు చేస్తానన్న నమ్మకం కలుగుతోంది అంది.


Click it and Unblock the Notifications