KGF 2 ఆ విషయంలో కష్టపడక తప్పలేదు.. రెండు గంటలపాటు కదలకుండా..: సంజయ్ దత్

KGF సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సౌత్ ఆడియెన్స్ అనే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా ఈ హై వోల్టేజ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వేయిట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ తోనే సినిమా అంచనాల డోస్ ను మరింత పెంచగా నటుడు సంజయ్ తన మాటలతో బాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా నమ్మకాన్ని పెంచాడు.

అంచనాల డోస్ పెంచిన సంజయ్ దత్

అంచనాల డోస్ పెంచిన సంజయ్ దత్

సినిమా బాక్సాఫీస్ వద్ద పక్కా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకోగలదని టీజర్ తోనే అర్ధమవుతోంది. మదర్ సెంటిమెంట్ తో పాటు మరిన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్లు అర్థమయ్యింది. ఇక సినిమాలో సంజయ్ దత్ అధిరా పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయాన KGF 2 పై పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.

ఎవరు ఊహించని విధంగా..

ఎవరు ఊహించని విధంగా..

సంజయ్ దత్ మాట్లాడుతూ.. నా సినిమా కెరీర్ లోనే మొదటిసారి ఒక విభిన్నమైమ పాత్రలో నటించాను. ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపిస్తాను. మునుపెన్నడు లేనంత హావభావాలు నాలో కనిపిస్తాయి. సినిమా మొత్తంగా నా పాత్ర ఎవరు ఊహించని విధంగా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను

ఒక మంచి స్నేహం ఏర్పడింది

ఒక మంచి స్నేహం ఏర్పడింది

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అతని మేకింగ్ స్టైల్ అద్భుతమనే చెప్పాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టిస్టులను చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. సెట్ లో చాలా కూల్ గా ఉంటారు. మా ఇద్దరి మద్య ఈ సినిమాతో ఒక మంచి స్నేహం ఏర్పడింది. సినిమాపై ఆయనకున్న ఆలోచనలను నాతో పంచుకున్నారు కూడా. అతన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను.

కెరీర్ బెస్ట్.. అధిరా రోల్

కెరీర్ బెస్ట్.. అధిరా రోల్

ఒక విదంగా నా పాత్రలో నటించడానికి నేను ఎక్కువగా శ్రమ పడలేదు. వీలైనంత వరకు హ్యాపీగానే సాగింది. చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. మన కెరీర్ లో చెప్పుకోదగ్గ పాత్రలు ఎన్నో ఉన్నా అందులో చిరస్థాయిగా గుర్తిండిపోయేలా చేసేవి కొన్నే. అందులో అధిరా ఒకటి. అంతా డిఫరెంట్ గా పాత్రను డిజైన్ చేశారు.

మేకప్ కోసం రెండు గంటలు పట్టేది

మేకప్ కోసం రెండు గంటలు పట్టేది

జాలి దయ లేని అత్యంత క్రూరమైన వ్యక్తి అధిరా. దర్శకుడు పాత్రను చాలా పవర్ఫుల్ గా చూపించాడు. అయితే పాత్ర కోసం మేకప్ కు చాలా సమయం పట్టేది. కొన్ని సందర్భాల్లో మేకప్ వేయడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పట్టేది. కదలకుండా అలానే ఉండాల్సి వచ్చేది. చాలా కాలం తరువాత అలా విభిన్నమైన పాత్ర చేస్తున్నందుకు ముందే నేను శారీరకంగా కష్టపడలని డిసైడ్ అయ్యాను.

యష్ తో పోటీ పడి..

యష్ తో పోటీ పడి..

సినిమా కథ చెప్పగానే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. KGF చాప్టర్ 1లో ఉన్న యాక్షన్ ఎపిసో కంటే ఎక్కువగా ఈ సినిమాలో యాక్షన్ ఉంటుంది. యష్ నేను పోటీ పడి మరీ నటించాము. అంతే కాకుండా మనసును తాకే ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంతకంటే సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను. తప్పకుండా వెండితెరపై ఈ యాక్షన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతారని.. సంజయ్ దత్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X