స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమా ప్రేరణతో వర్మ సినిమా

By Srikanya

వర్మ హిందీలో రూపొందిస్తున్న'డిపార్ట్‌మెంట్' సినిమాలో సంజయ్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంజయ్‌ దత్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు వర్మ. హాలీవుడ్‌లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన 'మ్యూనిచ్' సినిమా ప్రేరణతో ఈ సినిమా తీయనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. 'మ్యూనిచ్'లో ఆ సినిమాలో ఎరిక్ బానా చేసిన కేరక్టర్ తరహాలో సంజయ్ పాత్రను మలచాలని ఆయన భావిస్తున్నానని అన్నారు. అలాగే ఆ పాత్ర పోషణ కోసం తన బాడీని మరింతగా బిల్డప్ చేయటానికి సంజయ్ రెడీ అవుతున్నారు. దాదాపు 90 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ థ్రిల్లర్‌ని రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు.

ఆయన ఈ విషయమై మాట్లాడుతూ.. "సంజయ్ మన చివరి యాక్షన్ హీరో అని నేను నిజంగా నమ్ముతా. అందుకే ఓ అంతర్జాతీయ కార్యాన్ని నెరవేర్చే ఒన్ మేన్ ఆర్మీగా ఆయన పాత్రను మలుస్తున్నా'' అని అన్నారు. ఈ సినిమాలో సంజయ్ డేర్‌డెవిల్ స్టంట్స్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇక సంజయ్ దత్ రీసెంట్ గా విడుదలైన 'అగ్నిపథ్'లో విలన్‌గా అదరకొట్టిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X