రామ్ గోపాల్ వర్మ, సంజయ్ దత్ మధ్య వాగ్యుద్ధం!
తన జీవితంలో మళ్లీ రామ్ గోపాల్ వర్మతో పని చేసే ప్రసక్తే లేదని, అతని లాంటి చెత్త డైరెక్టర్‌ను నేను ఇప్పటి వరకు చూడలేదు అంటూ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ తేల్చి చెప్పారు. ఓ ప్రముఖ పత్రికతో ఆయన మాట్లాడుతూ...హిట్లు, ప్లాపులు అనేవి పరిశ్రమలో సర్వ సాధారణమే. అయితే వర్మతో మాత్రం మళ్లీ పని చేయనని చెప్పుకొచ్చారు. వర్మ కూడా తనను నటించమని అడుగుతాడని కోరతాడని అనుకోవడం లేదని దత్ చెప్పుకొచ్చారు.
తనకు 32 సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమలో అనుభవం ఉందని ఎలాంటి కెమెరాలు ఎలాంటి సీన్లకు సూటవుతాయో తనకు తెలుసని, ఈ విషయమేకాక అనేక విషయాల్లో వర్మ తమ మాట అస్సలు పట్టించుకునే వాడే కాదని సంజయ్ దత్ దత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంజయ్ దత్ ప్రొడక్షన్స్ సిఈఓ ధరమ్ ఒబెరాయ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపై వర్మతో ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టబోమని, అతనంత వేస్ట్ క్యాండేట్ లేరు అనే విధంగా ఫైర్ అయ్యారు. 5డి కెమెరాలు గట్రా సినిమాపై పెద్దగా ప్రభావం చూపబోవని తాముముందే చెప్పామని, అయితే వర్మ తమ మాట వినిపించుకోలేదని చెప్పారు.
వర్మ కూడా ఇదే విధంగా స్పందించారు. నా జీవితంలో అలాంటి వాళ్లని చూడలేదని, వాళ్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ, నేను మాత్రం ఇకపై వాళ్ల మొహాలు చూడొద్దని నిర్ణయించుకున్నా, డిపార్ట్‌మెంట్ చిత్రం విషయంలో తన చర్యను సమర్థించుకున్నారు. సంజయ్ డిపార్ట్ మెంట్ చిత్రం స్క్కీన్ ప్లే మార్చాలని గొడవ చేశాడని వర్మ చెప్పుకొచ్చారు. అదే విధంగా ఈ చిత్రం నుంచి కంగనా రనౌత్ ను తొలగించాలని దత్ పట్టుబట్టాడని చెప్పాడు. చిత్రం డిఫరెంట్‌గా తీయడం వల్లనే విమర్శలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
మొత్తానికి డిపార్ట్ మెంట్ చిత్రం ప్లాపు కావడం సంజయ్ దత్, రామ్ గోపాల్ వర్మ మధ్య అగాధం సృష్టించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. మరి వీరి మధ్య ఈ గొడవ ఎంత కాలం సాగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











