twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్రీ ఆఫర్ ప్రకటించిన హీరో వీరాభిమాని, మీరూ వెళ్లొచ్చు..!

    By Bojja Kumar
    |

    ముంబై: అభిమానులందు వీరాభిమానులు వేరయా.....అనడానికి నిదర్శంగా ఉంటుంటారు కొందరు ఫ్యాన్స్. సౌత్ ముంబైలో ఓ అభిమాని చేసిన ప్రకటించిన ఆఫర్ చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ నటుడు సంజయ్ కు వీరాభిమాని అయిన 'నూర్ మహదీ' హోటల్ యజమాని ఖలీద్ హకీమ్ సంజయ్ దత్ జైలు నుండి విడుదలవుతున్న సందర్భంగా ఫ్రీ ఆఫర్ ప్రకటించారు.

    ఈ నెల 25న(గురువారం) సంజయ్ దత్ జైలు నుండి విడుదలవుతున్నాడు. ఈ రోజు తమ హోటల్ కు వచ్చిన వారికి ప్రత్యేక వంటకం 'చికెన్ సంజూ బాబా' ను ఉచితంగా వడ్డించనున్నట్లు ఖలీద్ ప్రకటించారు. ఆ రోజు మధ్నాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

    sanjay dutt

    ఈ ఆఫర్ ప్రకటించడంపై ఖలీద్ స్పందిస్తూ.....30 ఏళ్ల క్రితం సంజయ్ దత్ తమ హోటల్ లో ఫ్యామిలీ సెక్షన్ ప్రారంభోత్సవానికి వచ్చారని ఖలీద్ తెలిపారు. 'చికెన్ సంజూ బాబా' వంటకాన్ని సంజయ్ స్వయంగా తయారు చేసి తనకు కానుకగా ఇచ్చారని తెలిపారు. తరచూ సంజయ్ దత్ తమ హోటల్ కు వచ్చే వారని, ఆయనకు నాన్ వెజ్ వంటకాలంటే చాలా ఇష్టం... నల్లి నారీ వంటకం చాలా ఇష్టంగా తింటారని ఖలీద్ తెలిపారు.

    1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

    Chicken Sanju Baba

    రెండు దశాబ్దాల క్రితం సంజయ్ దత్ 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

    ఈ ఏడాది అక్టోబర్‌ వరకు ఆయన శిక్ష అనుభవించాల్సి ఉన్నా....8 నెలల ముందుగానే విడుదల చేస్తున్నారు. జైల్లో సంజయ్‌దత్ ప్రవర్తన చాలా బావుందని, సత్ర్పవర్తన కారణంగా అతన్ని ముందుగా విడుదల చేస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ ప్రకటించింది.

    English summary
    Bollywood actor Sanjay Dutt, serving five-year sentence at the Yerawada central prison in Pune for illegal possession and destruction of an AK-56 rifle in 1993 serial blasts case, will be released on February 25.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X