twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జైలుకు సంజయ్ దత్ ఏం తీసుకెళ్లాడంటే...

    By Srikanya
    |

    ముంబయి: 1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషి అయిన సంజయ్‌ మిగిలిన మూడున్నరేళ్ల జైలు శిక్షను అనుభవించేందుకు గురువారం ముంబయిలోని టాడా కోర్టు ఎదుట లొంగిపోయారు. సంజయ్‌దత్‌ తన వెంట జైలుకు భగవద్గీత, రామాయణం, హనుమాన్‌ చాలీసా గ్రంథాలతో పాటు టూత్‌పేస్ట్‌, షాంపూ, చెప్పుల జతతో పాటు దోమల నివారణ మందులను తీసుకెళ్లారు.

    జైలులో ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు తాగేందుకు కోర్టు అనుమతించలేదు. అయితే, నెలరోజుల పాటు ఇంటి నుంచి ఆహారం, ఔషధాలు తెప్పించుకునేందుకు, మందపాటి పరుపు, దిండు సమకూర్చాలన్న వినతిని అంగీకరించింది. లొంగుబాటు గడువును పొడిగించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అంతకుముందు న్యాయస్థానం నిర్దేశించినట్లుగానే గురువారం ఆయన టాడా కోర్టు ముందు హాజరయ్యారు.

    మార్చి 21న సుప్రీంకోర్టు సంజయ్‌దత్‌కు ఐదేళ్ల శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఏడాదిన్నరపాటు కారాగార వాసాన్ని గడిపినందున మిగిలిన శిక్షా కాలాన్ని పూర్తి చేయాల్సి ఉంది. పేలుళ్ల కేసులో దోషులైన మరో నలుగురు కూడా గురువారం టాడా కోర్టులో లొంగిపోయారు. వీరు... ఎస్సా మెమన్‌ (టైగర్‌ మెమన్‌ సోదరుడు) కేర్సి అద్జానియా, యూసుఫ్‌ నుల్వాలా, అల్తాఫ్‌ సయ్యద్‌ షేక్‌. మరో ఇద్దరు దోషులు..జేబున్సిసా కాజీ, షరీఫ్‌ (దాదా) శుక్రవారం లొంగిపోనున్నారు.

    కోర్టులో లొంగుబాటు ప్రక్రియ ముగిసిన తర్వాత సంజయ్‌దత్‌ను ముంబయిలోని ఆర్దర్‌రోడ్‌ కేంద్ర కారాగారానికి తరలించారు. త్వరలోనే పుణేలోని ఎరవాడ జైలుకు తరలించే అవకాశముంది. సంజయ్‌దత్‌ గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రత్యేక టాడా కోర్టుకు వచ్చారు. ఆయన వెంట భార్య మాన్యత, సినీ నిర్మాత మహేష్‌ భట్‌, సోదరి, పార్లమెంటు సభ్యురాలు ప్రియ, బావ ఓవెన్‌ రాన్‌కన్‌ ఉన్నారు. కోర్టులో ప్రవేశించగానే సంజయ్‌ దత్‌ తలవంచి జడ్జి జీఏ సనప్‌కు అభివాదం చేశారు.

    ఆ వెంటనే లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియను న్యాయస్థానం చేపట్టింది. దోషి గుర్తింపులో భాగంగా న్యాయమూర్తి సంజయ్‌ పేరును, శిక్షాకాలం వివరాలను అడిగి నిర్ధరించుకొన్నారు. ఆ తర్వాత సంజయ్‌ న్యాయవాది రిజ్వన్‌ మర్చెంట్‌ తన క్త్లెంటుకు జైలులో కల్పించాల్సిన సదుపాయాలగురించి విన్నవించారు.

    సంజయ్‌దత్‌కు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా కోరుతూ త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆయన న్యాయవాది తెలిపారు. బాలీవుడ్‌ నటీనటులు, దర్శక నిర్మాతలు, బంధు మిత్రులు బాంద్రాలోని ఇంపీరియల్స్‌ హైట్స్‌ భవనంలోని దత్‌ నివాసానికి వచ్చి అధైర్యపడవద్దన్నారు.

    English summary
    Sanjay Dutt finally surrendered before special court to serve is remaining three and half years imprisonment in 1993 Mumbai blasts case.Sources say Bollywood's 'Munnabhai' has resigned himself to serving the remaining tenure of his sentence and returning to jail without creating more controversies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X