For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మన ఎఫైర్ సినిమాలో ఉండోద్దు... బయోపిక్ పై సంజయ్ దత్ మాధురీ దీక్షిత్ కాల్

  |

  సంజయ్‌దత్ బయోపిక్‌ షూటింగ్‌ మొదలైంది. సంజయ్‌దత్ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్నారు. దియామిర్జా నాయిక. రాజ్‌కుమార్‌ హిరానీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశాన్ని శనివారం సంజయ్‌దత క్లాప్‌కొట్టి ప్రారంభించారు. ఈ వేడుకలో భాగంగా చిత్ర యూనిట్‌తో కలిసి కేక్‌ కట్‌ చేసిన పిక్చర్‌ని దియామీర్జా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ''ఈ ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన ప్రదేశం రాజ్‌కుమార్‌ హిరానీ ఫిల్మ్‌ సెట్‌'' అని క్యాప్షనగా రాసింది. సంజయ్‌ దత తండ్రి సునీల్‌ దత పాత్రలో పరేశ రావల్‌ నటిస్తున్నారు. జర్నలిస్ట్‌ పాత్రలో అనుష్క శర్మ నటిస్తోంది. సోనమ్‌ కపూర్‌ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. సంజయ్‌దత తల్లి పాత్రకు నటీమణి ఎంపిక జరుగుతోంది.

  ఈ నేపథ్యం లో ఒకనాటి బాలీవుడ్ జంట... మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇద్దరూ మరెవరో కాదు. మాధురీ దీక్షిత్, సంజయ్ దత్. వీరిద్దరూ 90లలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఖల్ నాయక్ సినిమా సందర్భంగా సంజయ్, మాధురిలపై అప్పట్లో బోలెడు పుకార్లు కూడా వినిపించాయి. అయితే ఆమె వాటిని ఖండించలేదు.. అవునని చెప్పలేదు అయితే ఇప్పుడు ఈ బయోపిక్ సందర్భంగా మాధురీ దీక్షిత్ టాపిక్ వచ్చిందంట.

  ఆమెతో సంజయ్ రిలేషన్ షిప్ సినిమాలో చూపిస్తారా అన్న ఆలోచనలతో ఉన్న అభిమానులకు.. దానిపై పెద్దగా వెళ్లరనే తెలుస్తోంది. దీనిపై మాధురితో ఎలాంటి చర్చలు జరపకూడదని.. ఆమె ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం గడుపుతుండగా.. ఆ పాత విషయాలన గుర్తు చేయొద్దని అన్నాడట సంజయ్. మరోవైపు మాధురి కూడా తన ఒకనాటి బాయ్ ఫ్రెండ్ జీవితంపై వస్తున్న సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని బాలీవుడ్ టాక్.

  Sanjay Dutt in biopic directed by Rajkumar Hirani

  అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఇప్పుడు మళ్ళీ ఈ మాజీ ప్రేమికుడికి మాధురి కాల్ చేసిందట గతంలో బాగా క్లోజ్ గా ఉన్నప్పటికీ మాధురీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం.. సంజయ్ దత్ లైఫ్ లో చాలా జరిగిపోవడం జరిగింది. అయితే 25ఏళ్ల తర్వాత మాధురీ ఫోన్ చేసిందట..

  అందుకు కారణం ఇటీవలే రాజ్ కుమార్ హిరాణీ సంజయ్ దత్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సంజయ్ దత్ క్యారెక్టర్ ను రణబీర్ కపూర్ చేయనున్నట్లు కూడా తెలిపారు. అయితే సంజయ్ దత్ జీవితకథలో తన గురించి ఏమన్నా చూపిస్తారేమో అని వాకబు చేసిందట. అయితే తన గురించి ఎటువంటి సన్నివేశాలూ లేకుండా చూసుకుంటానని మాధురీకి సంజయ్ హామీ ఇచ్చాడట.

  సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించబోతున్న ఈ సినిమా వచ్చే సెప్టేంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లేటెస్ట్ బాలీవుడ్ న్యూస్ అప్‌డేట్స్ ప్రకారం 2017 క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సంజయ్ దత్ జైలు నుంచి విడుదలవడం, అదే సందర్భంలో జాతీయ జండాకి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలు ఈ సినిమాలో వున్నట్టు తెలుస్తోంది.

  English summary
  For the biopic on Sanjay Dutt, the '3 Idiots' director has roped in Bollywood heartthrob Ranbir Kapoor to play the convicted star.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X