నాగార్జున డబ్బులు ఎగ్గొట్టాడంటూ ఆ హీరో...
నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్, చాలా పద్దతి గల మనిషి,దేని లెక్క దానిదే అన్నట్లు ఉంటాడు వంటివన్నీ చెప్తుంటారు.అయితే తాజాగా హైదరాబాద్ కి వచ్చిన సంజయ్ దత్ నాగార్జునపై ఓ కామెంట్ చేసాడు.'చంద్రలేఖ'లో కనిపించినందుకు తనకు నయాపైసా కూడా ఇవ్వలేదని,అందుకే తెలుగు సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని డైరక్ట్ గా మొహమాటం లేకుండా అనేసాడు.కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున స్వయంగా తన బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'చంద్రలేఖ'.మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ డైరక్షన్‌లో మలయాళంలో వచ్చిన చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆడలేదు.అయితే అందులో వెరైటీగా ఉంటుందని ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని తీసుకొచ్చారు.ఆయన పాపం నాగార్జునపై ఉన్న గౌరవమో మరేమో కానీ..తనకున్న ప్యాన్ ఫాలోయింగ్ ని ప్రక్కన పెట్టి నటించాడు. అయితే అందుకు రెమ్యునేషన్ కూడా ఇవ్వలేదని ఇన్నాళ్ళ తర్వాత ఆయన బయిట పెట్టారు.
ప్రస్తుతం నాగార్జున ఢమురకం చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైథలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











