twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మున్నాబాయ్‌కి ఎదురు దెబ్బ: పిటిషన్ తిరస్కరణ

    By Pratap
    |

    Sanjay Dutt
    న్యూఢిల్లీ: జైలు నుంచి బయటకు రావడానికి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఏ ఆశా లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. 1993 బొంబాయి పేలుళ్ల కేసులో కోర్టు తీర్పును రివ్యూ చేయాలని ఆయన పెట్టుకున్న కురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసి పుచ్చింది.

    1993 ముంబై పేలుళ్ల కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఐదేళ్ల కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యెరవాడ జైలులో ఉన్నారు. సంజయ్ దత్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడానికి ఏ విధమైన అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు.

    దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

    English summary
    The Supreme Court on Tuesday, July 23 dismissed Sanjay Dutt's curative petition seeking a review of the court's verdict in connection with Bombay Blasts 1993 case. The Bollywood actor has exhausted all legal options to become a free man but all his efforts have gone in vain.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X