For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిర్మాతను బెదిరించిన కేసులో సైతం హీరో

  By Srikanya
  |

  ముంబయి : బాలీవుడ్‌ నిర్మాత షకీల్‌ నురానీని బెదిరించిన కేసులో నటుడు సంజయ్‌దత్‌కు సోమవారం అంధేరి న్యాయస్థానం బెయిలుకు వీలులేని వారెంటును జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో హాజరవడంలో నటుడు విఫలమవడంతో ఈ వారెంటు జారీ అయ్యింది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంజయ్‌దత్‌కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ శిక్షను అనుభవించేందుకు సంజయ్‌దత్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది.

  ఈ కేసుకు సంబంధించి దత్‌ పునఃసమీక్ష పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇంతలోనే బెయిలుకు వీలుకాని వారెంటు జారీ అయ్యింది. అనంతరం మధ్యాహ్నం సమయంలో సంజయ్‌దత్‌ తన న్యాయవాది రిజ్వాన్‌తో కలిసి న్యాయమూర్తి ఎదుట హాజరై బెయిలు అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం రూ.10,000 పూచీకత్తుపై బెయిలు మంజూరుచేసింది. తదుపరి విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది.

  2002లో నురానీ నిర్మాణంలోని 'జాన్‌కీ బాజీ' చిత్రం కోసం సంజయ్‌దత్‌ సంతకం చేశారు. తరువాత కొన్ని కారణాల వల్ల వైదొలిగారు. నురానీ నుంచి తీసుకున్న రూ.50 లక్షలు తిరిగి చెల్లించేందుకు నిరాకరించారు. దీంతో సంజయ్‌దత్‌పై నురానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్‌దత్‌ కరడుగట్టిన నేరస్థుడని, దావూద్‌ ఇబ్రహీం తరఫున తనను బెదింరించాడని షకీల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  మరో ప్రక్క సుప్రీంకోర్టు నుంచి మరో నెల రోజుల పాటు ఊరట పొందిన సంజయ్ దత్ ఇంట్లో ఉండే పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తను నటిస్తున్న సినిమాలకు డబ్బింగ్ చెప్పాల్సిన ఆయన అందుకోసం తన ఇంట్లోని ఓ గదిని డబ్బింగ్ థియేటర్‌గా మార్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీలైనంత త్వరగా డబ్బింగ్ పనులు పూర్తి చేయాలనీ, అలాగే వీలైనంత ఎక్కువ సమయం తన ఇద్దరు పిల్లలతో గడపాలనీ భావించిన సంజయ్ ఈ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఆయన 'పోలీస్‌గిరి' సినిమాకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. కె.యస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ పోలీసాఫీసర్‌గా హీరో పాత్రను చేస్తున్నారు.

  ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ప్రాచీ దేశాయ్‌తో కలిసి ఓ పాటని సంజయ్ చేయాల్సి ఉంది. అలాగే 'జంజీర్'లోనూ రామ్‌చరణ్, ప్రియాంకా చోప్రాలతో ఓ కాంబినేషన్ సీన్ కూడా మిగిలుంది. రూ. 278 కోట్ల విలువ చేసే సినిమాల్లో తను నటిస్తున్నందున సరెండర్ కావడానికి కనీసం ఆరు నెలల గడువు కావాలని సంజయ్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు నెల రోజుల గడువిచ్చిన సంగతి తెలిసిందే. అయితే 'పోలీస్‌గిరి', 'జంజీర్'తో పాటు 'పీకే', 'ఉంగ్లీ' సినిమాల్లోనూ నటిస్తున్న సంజయ్, నెల రోజుల్లో వీటన్నింటినీ పూర్తి చేయడం కష్టమని వాటి నిర్మాతలే చెబుతున్నారు.

  English summary
  Bollywood actor Sanjay Dutt Monday secured bail from a Mumbai court which had issued a non-bailable arrest warrant against him in a cheating case filed by a movie producer. Andheri Metropolitan court issued the warrant against Dutt in a complaint filed by producer Shakil Noorani, who, among other things, alleged that the actor had failed to complete his movie "Jaan Ki Baazi" in 2002 despite taking the signing amount of Rs 5 million. Noorani, who also alleged threats by mafia at Dutt's behest, sought a refund of the signing amount and the alleged losses of around Rs.2 crore suffered in the project.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X