twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి పొలిటికల్ డ్రామయే‘కౌన్ బనేగా ముఖ్యమంత్రి’..!?

    By Sindhu
    |

    150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ లో రికార్డ్ సాధించిన దాసరి ఈ పది సంవత్సరాల్లో హిట్ అనే మాట వినలేకపోయారు. అడపా దడపా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయి. ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలకృష్ణతో ఫస్ట్ టైమ్ చేసిన 'పరమవీర చక్ర" ప్లాప్ చిత్రాల్లో అన్ని రికార్డుల్ని బ్రేక్ చేయ్యడంతో ఖంగు తిన్న దాసరి తన దృష్టిని బాలీవుడ్ వైపు మరల్చారు.

    కాగా దాసరి నారాయణ రావు చాలా కాలం తర్వాత మళ్లీ ఓ హిందీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈసారి రాజకీయ కథాంశాన్ని తన చిత్రం కోసం ఎంచుకుంటున్నారు. పొలిటక్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాకు 'కౌన్ బనేగా ముఖ్యమంత్రి' అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హీరోగా నటిస్తాడు. దీని షూటింగు త్వరలోనే దేశ రాజధానీ నగరం డిల్లీలో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గతంలో రాజేష్ ఖన్నాతో దాసరి 'ఆజ్ కా ఎమ్మెల్యే' పేరుతో హిందీలో ఓ రాజకీయ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.!

    English summary
    Veteran Telugu filmmaker, Member of Parliament, director, writer and actor Dasari Narayana Rao who recently completed directing 150 films is reportedly all set to direct Sanjay Dutt. Sources close to the producer say the script of this movie is based on politics and is titled 'Kaun Banega Mukhyamantri'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X