కంగనా రనౌత్ కోసం బరువు తగ్గుతున స్టార్ హీరో
ఏక్ నిరంజన్ చిత్రం పరాజయానికి కారణాలలో హీరోయిన్ కంగనా రౌనత్ ఒకటని చెప్పుతున్న సంగతి తెలిసిందే. అందులో ప్రభాస్ కీ ఆమెకీ మధ్య జోడీ కుదురక పోవటంతో రొమాంటిక్ ఏంగిల్ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అలాంటి సమస్యే ఆమెకు సంజయ్ దత్ తో ఎదురు కానుంది. ఆమె తాజాగా హిందీలో చేస్తున్న 'నాకవుట్'లో వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు. అందులోనూ సంజయ్ దత్ యాభై దాటిన మనిషి.కంగనాది పాతికేళ్ళ వయస్సు. ఇది గమనించిన సంజయ్ ఆమె కోసం బరువు తగ్గి స్లిమ్ అయ్యారు. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఒక హీరోయిన్ కోసం బరువు తగ్గించుకునే అవసరం సంజయ్ కి ఎప్పుడూ రాలేదు. జూన్ నుంచే ఆయన దీనికోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్నాడు. ఫలితంగా పదేళ్ల క్రితం ఎలా కనిపించేవాడో ఇప్పుడలా సన్నగా కనిపిస్తున్నాడనీ, ఆ ఇద్దరి మీదా ఇటీవల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు ఇద్దరి మధ్యా వయసు తేడా ఎక్కువున్నట్లు కనిపించలేదనీ ఆ సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు.మొత్తానికి రియల్ హీరో అనిపించుకున్నాడు సంజయ్.


Click it and Unblock the Notifications











