బాలకృష్ణ రీమేక్ చిత్రం టైటిల్ 'పోలీస్ గిరి'
ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ ఈ చిత్రంతో తమిళనాట రంగప్రవేశం చేస్తున్నారు. బాలకృష్ణ చేసిన పోలీస్ అధికారి పాత్రను సంజయ్ దత్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రానికి తనీందర్ రిటర్న్స్ అనే టైటిల్ పెట్టారు. అయితే టైటిల్ మరింత స్టైయిట్ గా ఉండాలని మార్చారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి కొలావరి డి పాటతో సంచలనం క్రియేట్ చేసిన అనిరుధ్ రవిచందర్ ని సంగీత దర్సకుడుగా ఎన్నుకున్నారు.
దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ...నేను తొలిసారిగా హిందీలో డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇది. సంజయ్ దత్ నా ఫేవరెట్ హీరో. అతన్నే డైరక్ట్ చేయటం ఆనందం గా ఉంది. తమిళ,తెలుగులో సూపర్ హిట్టైన లక్ష్మీ నరసింహా చిత్రాన్ని నేను తెరకెక్కిస్తున్నాను. ఈ చిత్రంలో అమితాబ్ ని ఓ కీలకపాత్రలోకి అడుగుతున్నాం. అయితే ఇంకా అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ అవుతుందనుకుంటున్నాను. అతను కొలావరి డి పాట ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. అతనికీ ఇదే తొలి బాలీవుడ్ చిత్రం అవుతుంది. ఈ ప్రాజెక్టుపై సంజయ్ దత్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన తమిళ ఒరిజనల్ చూసి ఇంప్రెస్ అయ్యారు అన్నారు.


Click it and Unblock the Notifications












