Double Ismart షూటింగ్‌లో సంజయ్‌ దత్‌కు ప్రమాదం.. బాలీవుడ్ ఖల్‌నాయక్ ఏం చేశాడంటే?

బాలివుడ్‌ అగ్రనటుడు సంజయ్‌ దత్‌ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. హీరోగా బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌లో నటించిన సంజయ్‌ దత్‌ ఈ మధ్య విలన్‌గా తన నటవిశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రమాదానికి గురైన ఈ నటుడు బ్యాంకాక్‌లో ఈరోజు చిత్రీకరణలో బాగంగా మరోసారి గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలను ఓసారి చూద్దాం..

షూటింగ్ ప్రారంభం.. ఇంతలోనే: హీరోగా హిట్‌ మూవీస్‌తో తన సత్తా నిరూపించుకున్న సంజయ్‌ దత్ ప్రతినాయకుడిగా కూడా రాణిస్తున్నాడు. ఇప్పటికే కేజీఎఫ్‌-2లో విలన్‌గా చేసి ప్రేక్షకులను ఆకర్షించారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కతున్న సినిమాలో తన విలనిజాన్ని చూపించనున్నారు.

sanjay dutt injure in double ismart movie shooting in Bangkok

ఇప్పటికే డబుల్‌ ఇస్మార్ట్‌ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లారు. షెడ్యూల్‌ ప్రారంభానికి ముందు యూనిట్‌ సభ్యులంతా గడిపిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వెకెషన్‌లో యూనిట్‌ సభ్యులు ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి షూటింగ్‌ సిద్ధమయ్యారు. రెండో షెడ్యూల్‌ ఈరోజే ప్రారంభమైంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని నటిస్తున్న ఇస్మార్ట్‌ శంకర్‌ సీక్వెల్‌ డబుల్‌ ఇస్మార్ట్‌ షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ బ్యాంకాక్‌ వెళ్లారు. యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణలో భాగంగా ఓ ఫైటింగ్‌ షూట్‌ చేస్తుండగా సంజయ్‌ దత్ తలకు గాయాలైనట్టు తెలుస్తోంది. హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లి చిత్రబృందం చికిత్స అందించిదంట. అంతే కాకుండా తలకు రెండు కుట్లు పడ్డాయంట. అయినా కూడా రెస్ట్‌ తీస్కోకుండా షూటింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో యూనిట్‌ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

sanjay dutt injure in double ismart movie shooting in Bangkok

ఏప్రిల్‌లో బ్లాస్టింగ్‌: ఏప్రిల్‌లో కేడీ అనే కన్నడ సినిమా షూటింగ్‌లో కూడా సంజయ్‌ దత్‌కు గాయాలయ్యాయి. ప్రేమ్‌ దర్శకత్వం వహించిన కేడీలో ధ్రువ్‌ సర్జా కథానాయకుడు. ఈ చిత్రంలో సంజయ్‌ దత్త కీలక పాత్రలో‌ నటించారు. షూటింగ్‌లో భాగంగా బెంగళూరు శివారులో సాహాస, పోరాట దృశ్యాలు చిత్రీకరించేందుకు సెట్‌లో భారీ ఏర్పాట్లు చేశారు.

బ్లాస్టింగ్‌ సీన్‌ చిత్రీకరించే సమయంలో ప్రమాదావశాత్రు పేలుడు సంభవించి సంజయ్‌ దత్తత‌ ముఖానికి, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరులో చికిత్స అనంతరం ముంబయి వెళ్లి విశ్రాంతి తీస్కున్నారు. ఈ ఏడాదిలోనే ఇలా రెండుసార్లు ప్రమాదాలు జరగడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. చిన్న గాయాలే అయినప్పటికీ, వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

sanjay dutt injure in double ismart movie shooting in Bangkok

ఫస్ట్‌ లుక్‌తో భారీ అంచనాలు: డబుల్‌ ఇస్మార్ట్‌లో సంజయ్‌ దత్‌ రోల్‌పై భారీ అంచనాలున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా జులై 29న విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. సంజయ్‌ దత్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. పూరీ కనెక్ట్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో చీత్రీకరిస్తున్నారు. ఈ సినిమా 2024 మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీస్కొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X