సీక్రెట్ గా సంజయ్‌దత్ జైలు మార్పిడి
పుణే: ముంబయి పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సినీనటుడు సంజయ్‌దత్‌ను మంగళవారం అర్ధరాత్రి అత్యంత రహస్యంగా పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16న ముంబయిలోని టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్‌దత్ 42 నెలల జైలు శిక్షను ఇంకా అనుభవించాల్సి ఉంది. దీనికి గాను తొలుత స్థానిక ఆర్థర్ రోడ్డు జైలులోని అండా గదిలో ఉంచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి అత్యంత రహస్యంగా సంజయ్‌ను ఆర్థర్ రోడ్డు జైలు నుంచి తరలించారు. బుధవారం వేకువజామున 4 గంటలకు సంజయ్ ఎరవాడ జైలుకు చేరుకున్నారు.
ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండే గదిని ఆయనకు కేటాయించినట్లు తెలిసింది. భద్రతా కారణాల రీత్యానే రహస్యంగా తరలించాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications












