జైల్లో సంజయ్ దత్ ఇలా...(ఫోటో లీక్)

జైలు విషయాల్లోకి వెళితే....జైల్లో సంజయ్ దత్ బుద్దిగా నడుచుకుంటున్నాడు. బెయిలుపై బయటకు రావడానికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. 1993 బొంబాయి పేలుళ్ల కేసులో కోర్టు తీర్పును రివ్యూ చేయాలని ఆయన పెట్టుకున్న కురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తోసి పుచ్చింది.
సంజయ్ దత్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడానికి ఏ విధమైన అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు.
దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్‌దత్ కాగిత సంచుల తయారీలో శిక్షణ పొందుతున్నాడు.
సంచుల తయారీలో నైపుణ్యం సాధిస్తే సంజయ్ దత్‌కు రోజుకు రూ.25 నుంచి రూ.40 సంపాదిస్తారని జైలు అధికారులు తెలిపారు. మొదట్లో జైలు వంటశాల పనిని ఆయనకు అప్పగించాలని అధికారులు భావించారు. భద్రతా కారణాల దృష్ట్యా మార్పులు చేశారు.


Click it and Unblock the Notifications











