twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ 'ఢీ' లో శ్రీహరి పాత్రలో ఆ స్టార్

    By Srikanya
    |

    శ్రీను వైట్ల సూపర్ హిట్ చిత్రం ఢీని కూడా హిందీలో రీమేక్ చేయాటనికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రంలో కీలకపాత్రలో చేయటానికి సంజయ్ దత్ ఓకే చేసారు.తె్రలుగులో శ్రీహరి చేసిన జెనీలియా అన్న పాత్రని సంజయ్ దత్ చేయనున్నారు. సంజయ్ దత్ ని కలసిన కోన వెంకట్ ఈ క్యారెక్టర్ ని చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఇంద్రకుమార్ ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారని సమాచారం. ఇంద్రకుమార్ గతంలో ఢమాల్, డబుల్ ఢమాల్, మస్తీ వంటి కామిడీ సినిమాలు రూపొందించారు.

    రైటర్ కోనవెంకట్ ఈ హిందీ వెర్షన్ కి స్క్రిప్టు రాయమని అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటిక్ రెడీ, పోకిరి చిత్రాలు హిందిలో రీమేక్ అయ్యాయి. అలాగే విక్రమార్కుడు, కిక్ చిత్రాలు రీమేక్ లు షూటింగ్ లో ఉన్నాయి. మర్యాదరామన్న రీమేక్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక హిందీ డీ కోసం హిరో గా రితీష్ దేశముఖ్ ని అనుకుంటున్నారు. అతను ఇంద్రకుమార్ గత చిత్రాల్లో చేసి ఉన్నారు. అలాగే జెనీలియాను హీరోయిన్ గా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.

    English summary
    Sanjay Dutt is playing the role of Srihari in the Hindi remake of Telugu movie Dhee. Sources say that writer Kona Venkat will be narrating the movie script to Sanjay Dutt who plays Mangal Bhai - the role of heroine's elder brother.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X