twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ చొక్కా విప్పి కండలు చూపుతూ ఫైట్

    By Srikanya
    |

    ముంబై: సల్మాన్ ఖాన్ ఎప్పుడైతే దబాంగ్ క్లైమాక్స్ లో చొక్కా విప్పి కండలు చూపి ఫైట్ చేసి శభాష్ అనిపించుకున్నాడో అప్పటినంచీ అందరి హీరోలు ఆ ఫీట్ చేయటానికి ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి తెలుగు హీరో రామ్ చరణ్ చేరనున్నట్లు సమాచారం. తన తాజా చిత్రం జంజీర్ రీమేక్ లో సంజయ్ దత్ తో చొక్కా విప్పి బేర్ బాడీతో ఫైట్ చేయటానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. వీరిద్దరి మధ్యనా వచ్చే ఫైట్ ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దటానికి దర్శకుడు అపూర్వ లఖియా ప్రస్తుతం ఫైట్ మాస్టర్స్ తో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    రామ్ చరణ్ ఈ విషయమై మాట్లాడుతూ... మా మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని భావిస్తున్నాను. సామి హింది రీమేక్ షూటింగ్ సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి మాట్లాడాను. మేం ఇద్దరం కలిసి చేసే షెడ్యూల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అన్నారు. ఈ మేరకు రామ్ చరణ్ వర్కవుట్స్ చేసి మరీ కండలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా రామ్ చరణ్.. బాలీవుడ్ ఎంట్రీ అదిరేటట్లు ఉంది అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    రామ్ చరణ్ హిందీలో ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం 'జంజీర్'. అమితాబ్ సూపర్ హిట్ కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం ప్రోమో సాంగ్ షూట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ లపై స్పైసీగా ఈ సాంగ్ ని ప్రమోషన్ కోసం షూట్ చేసి భారీగా విడుదల చేస్తున్నారు. ఈ పాట గురించి దర్శకుడు అపూర్వ లఖియా మాట్లాడుతూ.... జనవరిలో ఈ ప్రమోషన్ సాంగ్ షూట్ ఉంటుంది. అలాగే చిత్రం రీమేక్ గానీ ఈ ప్రమోషన్ సాంగ్ మాత్రం రీమిక్స్ మాత్రం కాదు అన్నారు. అలాగే జంజిర్ చిత్రం కథ గురించి మాట్లాడుతూ.. నిజాయతీపరుడైన పోలీసు అధికారికీ, చీకటి సామ్రాజ్యానికీ మధ్య సాగే యుద్ధంతో ఆ కథ నడుస్తుంది. ఏ కాలానికైనా తగిన కథ ఇది. చరణ్‌కి సరిపడే కథ అన్నారు.

    జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్.. విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా, తేజగా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సోనూసూద్(తెలుగు వెర్షన్ కి), సంజయ్ దత్(హిందీ వెర్షన్ కి), మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

    English summary
    Ram Charan said.. "I am sure our chemistry will rock. We shared a terrific rapport when we met in Hyderabad while Sanjay was shooting for the Hindi remake of Samy. I can't wait for our schedule together."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X