బాలయ్య సినిమాలో సంజయ్ దత్
హైదరాబాద్: దక్షిణాదిన హిట్టయిన చిత్రాలకు, ముఖ్యంగా తెలుగు ఘన విజయం సాధించిన సినిమాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ దేవగన్ లాంటి స్టార్ హీరోలు రీమేకుల్లో నటించి భారీ హిట్లు కొట్టారు.
తాజాగా తెలుగులో బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ అయిన 'లక్ష్మీ నరసింహ' చిత్రాన్ని సంజయ్ దత్ రిమేక్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ హిట్ డైరెక్టర్ కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.పి అగర్వాల్ నిర్మిస్తున్నారు. 'రాక్ ఆన్' మరియు 'బోల్ బచ్చన్' చిత్రాల ఫేం ప్రాచి దేశాయ్ ఈ చిత్రంలో హీరోయిన్.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 48 రోజుల పాటు ఏకధాటికగా ఇక్కడే షూటింగ్ జరుగనుంది. ఇప్పటికే సంజయ్ దత్ పోలిస్ డిప్యూటీ కమీషనర్ గా కనిపించే సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఓం పురి, మురళి శర్మ, ముఖేష్ తివారి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక బాలయ్య తాజా సినిమా శ్రీమన్నారాయణ రేపు(ఆగస్టు 30)న విడుదలకు సిద్ధం అవుతోంది. రవికుమార్ చావలి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో పార్వతి మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లు. ఎల్లో ఫ్లవర్స్ బేనర్ పై రమేష్ పుప్పాల ఈచిత్రాన్ని నిర్మించారు. చక్రి అందించిన సంగీతం మంచి విజయం సాధించడం, ట్రైలర్స్, అందులో బాలయ్య చెప్పే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











