14 రోజుల సెలవుపై జైలు నుండి విడుదలైన సంజయ్ దత్
హైదరాబాద్: పూణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్ దత్‌కు 14 రోజుల సెలవు లభించింది. మంగళవారం రాత్రి ఆయన జైలునుండి ఇంటికి వెళ్లినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 14 రోజుల అనంతరం ఆయన తిరిగి మళ్లీ జైలుకు రానున్నారు. గతంలోనూ సంజయ్ దత్ పలు రెండు సందర్భాల్లో పెరోల్ పై సంజయ్ బయటకు సెలవుపై వచ్చిన సంగతి తెలిసందే. ఓసారి భార్య మాన్యత దత్ అనారోగ్యం అనే కారణంతో, మరోసారి తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు అంటూ పెరోల్ తీసుకున్నారు.
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ గతేడాది మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.


Click it and Unblock the Notifications











