twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ హిట్ 'సత్తే పే సత్తా ఫిర్' రీమేక్ లో స్టార్ హీరో

    By Srikanya
    |

    బాలీవుడ్ సినీ చరిత్రంలో 'సత్తే పే సత్తా ఫిర్'కి ఓ ప్రత్యేక స్టానం ఉంది. అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్లలో ఒకటనే కాక ఇప్పటకీ కామిడీకి ఆ చిత్రాన్ని ఉదహరిస్తూంటారు. ఇప్పుడా చిత్రం సంజయ్ దత్ తో రీమేక్ చేయబోతున్నారు. 'కాల్', 'లక్' చిత్రాల దర్శకుడు సోహమ్ షా ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభమయ్యే ఈ సినిమా అదే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.ఇక ఈ చిత్రాన్ని మొదట 'సత్తే పే సత్తా' తీసిన ఒరిజనల్ దర్శకుడు రాజ్ సిప్పీ...సెవెన్ టైటిల్ తో దర్శకత్వం చేద్దామనుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.

    ఆ తర్వాత సొహైల్ ఖాన్...సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని రీమేక్ చేద్దామనుకున్నారు. అయితే సల్లూ భాయ్ ఆసక్తి చూపకపోవటంతో అదీ ముందుకు వెళ్ళలేదు.ఇన్నాళ్ళకి సంజయ్ దత్ పూర్తి ఇంట్రస్టుతో ఉండటంతో ఈ చిత్రం ముందుకెళ్లే అవకాశం కనపడుతోంది. ఈ చిత్రాన్ని అష్టవినాయిక పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. సంజయ్ దత్ చొరవ చూపించి రైట్స్ ఇప్పించబట్టే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామని నిర్మాత అంటున్నారు. ఇక 'సత్తే పే సత్తా' సినిమా కూడా హాలీవుడ్ మ్యూజికల్ ఫిల్మ్ 'సెవెన్ బ్రైడ్స్ ఫర్ సెవెన్ బ్రదర్స్' ఆధారంగా రూపొందిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X