For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెలవు కోసం జైలు అధికారులకు సంజయ్ దత్ వినతి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పూణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్ దత్ తాజాగా పద్నాలుగు రోజుల సెలవు కావాలంటూ మరోసారి అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సంజయ్ దత్ పలు రెండు సందర్భాల్లో పెరోల్ పై సంజయ్ బయటకు సెలవుపై వచ్చిన సంగతి తెలిసందే. ఓసారి భార్య మాన్యత దత్ అనారోగ్యం అనే కారణంతో, మరోసారి తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు అంటూ పెరోల్ తీసుకున్నారు.

     Sanjay Dutt seeks 14 day furlough from Pune jail?

    1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

    రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ గతేడాది మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

    English summary
    Troubled Bollywood star Sanjay Dutt, who is currently in Pune's Yerwada jail, has reportedly appealed for a 14-day furlough. It has been reported that the 55-year-old actor has applied for the leave, with reasons best known to him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X