రామ్ చరణ్ ని ఆశ్చర్యపరిచిన సంజయ్ దత్
రామ్ చరణ్ తాజాగా జంజీర్ రీమేక్ నిమిత్తం నాలుగు రోజులు క్రితం వరకూ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి కుమారుడుగా రామ్ చరణ్ ని కలవటం జరిగింది. చివరి రోజున సంజయ్ దత్ సైతం జంజీర్ సెట్స్ కు వచ్చి మరీ తన విషెష్ తెలియచేసారు. అంతేగాక తన ఇంటికి వచ్చి తన భార్య చేసే బిర్యాని తినవలిసిందని ఆహ్వానించారు. చాలా సేపు రామ్ చరణ్ తో మాట్లాడుతూ సంజయ్ గడిపారు. తనకి చిరంజీవి మంచి స్నేహితుడని,తాను రామ్ చరణ్ ని కలవటం ఇదే ప్రధమమని అక్కడ మీడియాకు తెలియచేసారు. మొదట్లో ఈ చిత్రంలో విలన్ గా సంజయ్ దత్ ని అనుకున్నారు. కానీ కారణాంతరాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ఇక సంజయ్ దత్ తన సెట్స్ కు రావటంతో రామ్ చరణ్ చాలా ధ్రిల్ ఫీలయ్యాడని చెప్తున్నారు.
ఇక జంజీర్ చిత్రం రీమేక్ ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రామ్ చరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు.
ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత.
ఈ రీమేక్‌లో అమితాబ్ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియాని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఎవడు షూటింగ్ లో పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో ఈ ఎవడు చిత్రంలో కనపించనున్నారు.


Click it and Unblock the Notifications











