»   » వైరల్‌ఫొటో ఆఫ్ థిస్‌వీక్ : స్కూటర్ పై స్టార్ హీరో విత్ ఫ్యామిలీ

వైరల్‌ఫొటో ఆఫ్ థిస్‌వీక్ : స్కూటర్ పై స్టార్ హీరో విత్ ఫ్యామిలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత కొన్ని నెల‌ల పాటు భార్య మాన్యత, తన కవల పిల్లలతో కలిసి ప్రపంచాన్ని చుట్టేశాడు. తిరిగి భార‌త్ కు తిరిగి వ‌చ్చాడు.. ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాడు. తాజాగా "భూమి'' మూవీలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'భూమి'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆగ్రాలో జరుగుతోంది.

మూవీ షూటింగ్ విరామంలో సంజయ్‌దత్ ఫ్యామిలీ సెట్‌లో సందడి చేసింది. ఇవాళ సంజయ్ భార్య మాన్యత, ఇద్దరు పిల్లలు మూవీ సెట్‌కి వచ్చారు. షూటింగ్ విరామ సమయంలో మాన్యత, షహ్రాన్, ఇక్రాలతో కలిసి మున్నాభాయ్ స్కూటర్ రైడ్ చేశాడు. తన ఫ్యామిలీతో కలిసి చేసిన స్కూటర్‌రైడ్ ఫొటోలను సంజయ్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. మున్నాభాయ్ అండ్ ఫ్యామిలీ స్కూటర్ రైడ్ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

Sanjay Dutt takes scooter ride with family in Agra

ఇదీలావుంటే .. సంజ‌య్‌ద‌త్ జీవిత క‌థ ఇప్పుడు వెండి తెర‌పై ఆవిష్కరించ‌డానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్‌కుమార్ హిరాణీ ఈ సినిమాని రూపొందించనున్నారు. స్క్రిప్ట్ పనులు తుది దశకు వచ్చాయి. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించనున్న సంగతి తెలిసిందే

English summary
Sanjay Dutt looked every inch a common man enjoying a day out with his family. The actor who is currently shooting for his upcoming film Bhoomi in Agra was captured with his family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu