సంజయ్ దత్ జైల్లో సిక్స్ ప్యాక్ ఎలా..?(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ యరవాడ జైల్లో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవల పెరోల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. 14 రోజుల అనంతరం ఆయన మళ్లీ తిరిగి జైలుకెళ్లనున్నాడు. జైలు నుండి విడుదలైన అతనికి ‘పికె' ప్రత్యేక షో కూడా వేసారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి మీడియాతో రెండు ముక్కలు మాట్లాడారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Sanjay Dutt With Six Pack Abs; Out On Two Weeks Furlough

‘పికె' సినిమా విజయం సాధించడంపై సంజయ్ దత్ ఆనందం వ్యక్తం చేసారు. అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ, విధు వినోద్ చోప్రాలు మాత్రం ‘పికె' లాంటి సినిమాలు తీయగలరని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం నిజాలతో, నిజాయితీతో తీసిన చిత్రమని, ఇలాంటి చిత్రంలో తాను భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.

Sanjay Dutt With Six Pack Abs; Out On Two Weeks Furlough

కాగా....సంజయ్ దత్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మీడియా ఎదుటన తన సిక్స్ ప్యాక్ ప్రదర్శించారు. జైల్లో ఉన్న సంజయ్ దత్ సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

Sanjay Dutt With Six Pack Abs; Out On Two Weeks Furlough

ఈ సంగతి అలా ఉంచితే.....సంజయ్ దత్ కు రెండు వారాల పెరోల్ ఇవ్వడంపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఆయనకు పెల్ ఇవ్వడం వెనక ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే విషయాలు ఆరా తీస్తున్నారు.

Sanjay Dutt With Six Pack Abs; Out On Two Weeks Furlough

1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

Sanjay Dutt With Six Pack Abs; Out On Two Weeks Furlough

పికె సినిమా విషయానికొస్తే...అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఇటీవల విడులైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. ఇప్పటికే ఈచిత్రం వసూళ్లు 100 కోట్లు దాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X