మందు ముట్టనని స్టార్ హీరో శపధం

By Staff

Sanjay Dutt
రోజూ మందు పడందే రోజూ గడవని స్టార్ హీరో సంజయ్ దత్ హఠాత్తుగా మందు ఇక ముట్టను అనే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎందుకిలా అంటే ఆయన ఫిజికల్ ట్రైనర్ త్రాగుడు మానకపోతే బాడీ షేప్ అప్ అవదని వార్నింగ్ ఇచ్చాడని సంజయ్ దత్ స్వయంగా చెపుతున్నాడు. ఆయన క్రితం సంవత్సరం నవంబర్ ఇరవై ఏడున జైలు కెళ్ళి వచ్చిన దగ్గరనుండి జీవితాన్ని మరో కోణంలో చూడాలి నిర్ణయించుకుని ప్రయాణం ప్రారంభించానంటున్నాడు. అందులో భాగంగానే తన యుక్త వయస్సులో ఉన్నటువంటి హెల్త్ బాడీ,షేప్స్ మళ్ళి కావాలనుకున్నాడు.

అందుకే ప్రత్యేక శిక్షణ కోసం లాస్ ఏంజల్స్ నుండి Mark Twight అనే ఫిజికల్ ట్రైనర్ ని తెచ్చుకున్నాడు. Mark Twight హాలీవుడ్ లో దాదాపు మూడు వందల సినిమాలకు పనిచేసాడు. అక్కడి స్టార్స్ కి ఫిజికల్ ట్రైనర్ గానూ పనిచేసాడు. రోజులో ఎక్కువ భాగం జిమ్ లో గడపటానికే టైమ్ కేటాయిస్తున్నాడు. అయితే వయిస్సు మీద పడటం వల్లో మరెందుకో అనుకున్నంత వేగంగా శరీరం తిరిగి పుంజుకోవటం లేదని సంజు బాబాకి బెంగపట్టుకుంది. నిజానికి సిక్స్ పాక్ గురించి సినీ ప్రపంచం ఆలోచించని రోజునే ఆయన ఆ బాడీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.దాంతో ఆయన మరింత వర్రీ అవతున్నాడు. ఇది గమనించిన ట్రైనర్ ఆయన్ని కాస్త ఓపిక పట్టమని, అంతేగాక డ్రింకింగ్ పూర్తిగా మానేయమని సలహా ఇచ్చాడు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు సంజయ్ దత్. హ్యాపీ కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X