twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భన్సాలీ పరిస్థితి దారుణమట.. చేయని నేరానికి తల్లికి కూడ శిక్షే..

    By Rajababu
    |

    Recommended Video

    భన్సాలీ పరిస్థితి దారుణమట.. చేయని నేరానికి తల్లికి కూడ శిక్షే..!

    పద్మావతి వివాదం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మానసిక పరిస్థితి దారుణంగా మారింది. పద్మావత్ చిత్రానికి సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని హిందుత్వ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది అని భన్సాలీ మిత్రుడు, జర్నలిస్టు సుభాష్ ఝా తన సన్నిహితులకు వెల్లడించినట్టు సమాచారం.

     చేయని నేరానికి శిక్ష

    చేయని నేరానికి శిక్ష

    దర్శకుడు భన్సాలీ చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు. పద్మావతి చిత్రం వివాదంలో కూరుకుపోవడంతో నిద్రహారాలు మానివేశాడు అని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

     నేరస్థుడిగా చిత్రీకరించి

    నేరస్థుడిగా చిత్రీకరించి

    భన్సాలీని కొందరు ఓ నేరస్థుడిగా, దేశ ద్రోహి మాదిరిగా చూస్తున్నారు. తనకు సంబంధంలేని వివాదంలో కూరుకుపోయాడు. ఆరోగ్యం చేడిపోకుండా ఈ దేశంలో సినిమాలు తీయాలంటే ముందే చట్టాలను చదివేయాలేమో అని సుభాష్ ఝా ఓ కథనంలో పేర్కొన్నారు.

     మానసికంగా కుంగిన

    మానసికంగా కుంగిన

    పద్మావతి వివాదంతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయాడు. చుట్టు నెలకొన్న సమస్యల నుంచి బయటపడటానికి విపరీతమైన ధూమపానానికి (చైన్ స్మోకింగ్) అలవాటు పడ్డాడు. మానసిక క్షోభ నుంచి బయటపడటానికి గత కొద్దినెలలుగా లతా మంగేష్కర్ పాటలు వినడం, సిగరెట్లు కాల్చడం తప్ప మరో పనిపై ధ్యాసపెట్టడం లేదు.

     ఒంటరిగా వదిలేయండి

    ఒంటరిగా వదిలేయండి

    భన్సాలీకి కొంత ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించాను. అందుకు ఆయన మీరు కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది. కొన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలివేయండి. పరిస్థితులు చక్కబడుతాయి అని భన్సాలీ తనతో అన్నారని సుభాష్ ఝా పేర్కొన్నారు.

     బెదిరింపులు ఓ నరకం

    బెదిరింపులు ఓ నరకం

    ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఫోన్ కాల్స్ బెదిరింపులు మరో నరకంగా మారుస్తున్నది. ఫోన్ చేసి మాటలతో వేధించడంతో భన్సాలీ మానసికంగా చెదిరిపోయాడు. ప్రతీ విషయాన్ని ఆయనే క్షణ్ణంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకొంటున్నాడు.

     మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి

    మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి

    కొద్ది నెలలుగా తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. దాంతో ఆయన ల్యాండ్ లైన్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఇంట్లో వృద్ధురాలైన తల్లికి కూడా ఈ బాధ తప్పడం లేదు. ఈ సమస్యల ప్రభావం తల్లిపై పడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు.

     తల్లిపై ప్రభావం పడకుండా

    తల్లిపై ప్రభావం పడకుండా

    పద్మావతి చిత్రానికి సంబంధించి టెలివిజన్‌లో వచ్చే వివాదాస్పద వార్తలను తన తల్లి చూడకుండా, వినికుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఇంటి ముందు ధర్నా చేసే వ్యక్తుల ప్రభావం తల్లిపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నాడు.

    వివాదాలను ఒంటరిగానే

    వివాదాలను ఒంటరిగానే

    పద్మావతి వివాదం కేవలం భన్సాలీపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులందరిపై పడింది. కొన్నాళ్లు వివాదాలను ఒంటరిగానే ఎదుర్కోవాలని అనుకొన్నాడు. కొద్ది రోజుల నుంచి వాటిని పట్టించుకోవడం లేదు. పద్మావతి రిలీజ్ విషయంలో తన అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుందనే ధీమాతో దేవుడిపై భారం వేశాడు అని సుభాష్ ఝా వెల్లడించారు.

    English summary
    Famous journalist Subhash K Jha, who is very close to Sanjay Leela Bhansali, revealed some really disturbing details about the present condition of the filmmaker. Even when the CBFC has passed Padmaavat, some regional groups are still threatening SLB. He also told that Sanjay has stopped eating or sleeping properly. Read his revelations below.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X