హిందీ ‘విక్రమార్కుడు’కి 50లక్షల తెలుగు ఫైన్
'విక్రమార్కుడు' సినిమాని హిందీలో విక్రమ్ రాధోడ్ టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అందులోని పాపులర్ పదం, హీరో ఊతపదం అయిన 'చింతాక చితా చితా'ని ఆ చిత్రం పాటలో వాడుకున్నందుకు హైదరాబాద్ కి చెందిన ఆడియో కంపెనీ 50 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ కి చెందిన ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ ఈ మేరకు 'విక్రమార్కుడు'ఆడియో రైట్స్ పూర్తిగా తమకే చెందుతాయి కాబట్టని ముక్కు పిండి వసూలు చేసినట్లు హిందీ పాపులర్ పత్రిక ముంబై మిర్రర్ రాసుకొచ్చింది.
ఈ హిందీ రీమేక్ కు సాజిద్-వాజిద్ లు సంగీతం అందించారు. వారు తెలుగు పాట తరహాలో 'చింతాక చితా చితా'ని టైటిల్ సాంగ్ లో వాడేసారు. దాంతో ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ వారు లీగల్ నోటీస్ పంపారు. అయితే కోర్టు కన్నా బయిట సెటిల్ మెంట్ చేసుకోవటం బెస్ట్ అని భావించిన నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ...యాక్షై లక్షలు చెల్లించి సెటిల్ మెంట్ చేసుకున్నారు.
ఈ విషయమై ఆదిత్యా మ్యూజిక్ ఎండి ఉమేష్ గుప్తా మాట్లాడుతూ...ఈ విషయం మీద ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ స్ధాయిలో ఏమీ కామెంట్ చేయలేము అని అన్నారు. ఇక సంజయ్ లీలా భన్సాలీ కానీ ప్రభుదేవా కానీ, అక్షయ్ కుమార్ కానీ,సంగీత దర్శకుడు కానీ ఈ విషయమై కామెంట్ చేయటానికి ఆసక్తి చూపలేదు. అందరూ సమస్య సమిసి పోయింది కదా అన్నట్లుగా కలెక్షన్స్ సునామీని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక తెలుగు'విక్రమార్కుడు' చూసిన వాళ్లు ఈ సినిమా చూస్తే ఎక్కడా నిరాశపడే అవకాశం లేదని చెప్తున్నారు. తెలుగులో మాదిరిగానే ఈ సినిమాలోనూ కామెడీ, సెంటిమెంట్‌లు బాగా పండాయి. అక్షయ్‌కుమార్‌కు కామెడీ, యాక్షన్‌లు కొట్టిన పిండే కాబట్టి హిందీ విక్రమార్కుడులో సరిగ్గా ఒదిగిపోయాడు. తెలుగులో కీరవాణి సంగీతంతో పోల్చితే సాజిద్-వాజిద్ సంగీతం చెప్పుకోదగినంత లేదు. సిరాజ్ అహ్మద్ రాసిన డైలాగుల్లో ఎక్కువ భాగం తెలుగులో వినిపించిన పంచ్ డైలాగులే కావటం విశేషం. ఈ సినిమాలో డెరైక్టర్ ప్రభుదేవా కొత్తగా చేసింది ఏమీలేకపోయినా గానీ మూలం చెడకుండా జాగ్రత్తలు తీసుకోవటం కలిసి వచ్చింది.


Click it and Unblock the Notifications











