"గుజారిష్" చిత్రం కాపీ వివాదం... రెండు కోట్లు డిమాండ్
ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో విడుదలైన గుజారిష్ చిత్రం హిట్టా..పట్టా అనే సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడా చిత్రం కాపీ వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రం కథ తనదే నంటూ అఖిల్ రాజేంద్ర ద్వివేది అనే స్క్రీన్ ప్లే రైటర్ కేసు వేసారు. తనకు చెప్పకుండా తన కథని కాపీ కొట్టారని, తాను 2005 లోనే ఈ స్క్రిప్టు రిజిస్టర్ చేసానని, భాన్సాలీని 2008 లో కలిసానని ఆయన ఈ స్క్రిప్టుని చాలా ఇష్టపడ్డారని, త్వరలో కలుద్దామని చెప్పాడుని, ఆ తర్వాత ఆయన తనను పిలవలేదని వాపోతున్నాడు. అందుకే భన్సాలి తనకు న్యాయంగా రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక క్రితం శుక్రవారం ధియోటర్ లో ఆ చిత్రం చూసి షాక్ అయ్యాయని, తన స్క్రిప్టుకి బాగా దగ్గరగా ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉందని అంటున్నారు. డబ్బులు ఇవ్వటమే కాక టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వాలని కోరుతున్నాడు. మరో ప్రక్క సినిమా రిలీజ్ అవటానికి ముందు దయానంద్ రాజన్ అనే వ్యక్తి గుజారిష్ కథ నాదే అంటూ గొడవ ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











