కోరిక తీర్చుకుంటున్న ప్రిన్స్ మహేష్ బావ
మన సమాజంలో సినిమా నటులకు ఉండే గౌరవం, పేరు ప్రఖ్యాతలు, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దానికి ఒక్కసారి అలవాటయితే మళ్లీ మళ్లీ నటించాలని అనిపిస్తూ ఉంటుంది. డబ్బుకు డబ్బు, సెలబ్రిటీ హోదాకు సెలబ్రిటీ హోదా. అందుకే ఒక్కసారి అందులోకి దిగితే బయటకు రావాలనిపించదు. పెళ్లయి సినిమాలకు దూరమైనా, రాజకీయాల్లో వెళ్లినా అప్పుడప్పుడు నటనపై ఉన్న తమ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు చాలా మంది స్టార్స్. తాజాగా సినీ సెలబ్రిటీ హోదా కోసం తహ తహ లాడుతున్నారు ప్రిన్స్ మహేష్ బాబు బావ, మంజుల భర్త సంజయ్ స్వరూప్.
ఆ మధ్య 'ఏమాయ చేశావె" సినిమా ద్వారా నాగచైతన్య తండ్రిగా పాత్రలో కనిపించిన సంజయ్ స్వరూప్, ఆ తర్వారత వచ్చిన ఆరెంజ్ సినిమాలోనూ రామ్ చరణ్ బావ పాత్రలో తళుక్కుమన్నాడు. తాజాగా తన బావమరిది "దూకుడు" సినిమాలోనూ దూకారు సంజయ్. డాక్టర్ పాత్రలో కనిపించి అలరించారు. భార్య మంజులతో కలిసి సినిమా నిర్మాణ రంగంలో ఉన్న సంజయ్ స్వరూప్ తన శక్తిమేర ప్రయత్నించి మరీ సినిమాల్లో వేషాలు దక్కించుకుంటున్నాడు. ఈ విధంగా నటన విషయంలో తనకున్న కోరికను తీర్చుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











