»   » దండుపాళ్యం-2 దారుణమైన నగ్న దృశ్యాలు ఇలా తీశారు, సంజన క్లారిటీ

దండుపాళ్యం-2 దారుణమైన నగ్న దృశ్యాలు ఇలా తీశారు, సంజన క్లారిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దండుపాళ్యం 2 సినిమాకు సంబంధించిన కొన్ని నగ్న దృశ్యాలు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యంత దారుణంగా ఉన్న ఈ సీన్లలో సంజన ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించడం, దారుణంగా హింసిస్తున్న దృశ్యాలు ఉండటంతో తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

రెండు రోజుల క్రితం ఈ సీన్ల మీద సంజన స్పందిస్తూ అందులో నటించింది తానే అని, డూప్‌తో చేయించలేదని తెలిపింది. అయితే సెన్సార్ వారు ఆ సీన్లు కట్ చేసినట్లు సంజన పేర్కొన్నారు. అయితే ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ సీన్లు చిత్రీకరించిన తీరుపై సంజన క్లారిటీ ఇచ్చారు.


ఆ సీన్లును ఇలా తీశారు

ఆ సీన్లును ఇలా తీశారు

విమర్శలపై సంజన స్పందిస్తూ... తాను పూర్తిగా నగ్నంగానటించ లేదని, వెనక వైపు మాత్రమే నగ్నంగా కనిపించే డ్రెస్సింగ్ చేశారని, చిత్రీకరణ తర్వాత నగ్నంగా ఉన్నట్లు కనిపించేలా గ్రాఫిక్స్ చేశారని సంజన తెలిపారు.


ట్విట్టర్లో పోస్టు

ట్విట్టర్లో పోస్టు

వెనక వైపు నగ్నంగా.... ముందు వైపు శరీరాన్ని బట్టలతో కవర్ చేసుకున్న ఫోటోను సంజన్ పోస్టు చేసింది. ఈ ఫోటోలో ముందు వైపు సంజన బట్టలను ప్లాస్టర్ తో అతించారు. కింద భాగంలో లుంగీ లాంటి వస్త్రంతో కవర్ చేశారు. దీన్నే గ్రాఫిక్స్‌లో నగ్నంగా ఉన్నట్లు చూపించారు.


ఆ సీన్లు ఎలా లీక్ అయ్యాయో తెలియదు

ఆ సీన్లు ఎలా లీక్ అయ్యాయో తెలియదు

సెన్సార్ అభ్యంతరం తెలిపిన ఆ సీన్లు సోషల్ మీడియాలో ఎలా లీక్ అయ్యాయో తనకు తెలియదని, ఇది ఆందోళన కలిగించే విషయమే అని సంజన అన్నారు.


తప్పుడు ప్రచారం వద్దు

తప్పుడు ప్రచారం వద్దు


ఆ సీన్లు చూసిన చాలా మంది మూవీలో ఉంటాయని భావిస్తున్నారు. కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత అలాంటి సీన్లు లేకుంటే నిరాశకు లోనవ్వడం సహజం. అందుకే ఇలాంటి సీన్లు సినిమాలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరిగితే బాగోదు. దయచేసి ఈ సీన్లు ఉన్నాయని ఎవరూ భావించ వద్దు అని సంజన విజ్ఞప్తి చేశారు.
తెలుగులో జులై 21న విడుదల

తెలుగులో జులై 21న విడుదల

కాగా... దండుపాళ్యం 2 మూవీ కన్నడతో పాటు తెలుగులో ఒకేసారి రిలీజ్ అవ్వాల్సి ఉండగా..... పలు కారణాలతో తెలుగు రిలీజ్ ఆలస్యం అయింది. గత వారమే ఈ చిత్రం కన్నడలో రిలీజ్ అయింది. అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జులై 21న విడుదలవుతోంది.
అసహజ శృంగారం

ఇప్పటి వరకు అసహజ శృంగారానికి సంబంధించిన సీన్లు ఉన్న సినిమాలన్నీ వివాదాస్పదం అయ్యాయి. దండుపాళ్యం 2 మూవీలో ఇద్దరు మహిళల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉండటం కూడా వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.


భారీ లాభాలు ఖాయం

2012లో దండుపాళ్యం పార్ట్ 1 తొలుత కన్నడలో రిలీజైంది. అక్కడ విజయవంతం కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి ఫలితాలే సాధించింది. అప్పట్లో కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 40 కోట్ల వసూలు చేసింది. తొలి భాగం పెద్ద హిట్ కాబట్టి ఇపుడు వచ్చే సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయని, ఈ సారి కన్నడ, తెలుగు మార్కెట్లో కలిపి కనీసం రెట్టింపు... అంటే దాదాపు రూ. 80 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.


దండుపాళ్యం జైలు జీవితం

దండుపాళ్యం జైలు జీవితం

మొదటి భాగంలో దండుపాళ్యం గ్యాంగ్ అఘాయిత్యాలు చూపెడితే.... పార్ట్ 2లో ఈ గ్యాంగ్ జైలు జీవితం గురించి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, పోలీసుల చేతిలో ఎలాంటి హింసలకు గురయ్యారు, జైలు నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు లాంటి సంఘటనలు చూపించబోతున్నారు.


దండుపాళ్యం 2

దండుపాళ్యం 2

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.English summary
Actress Sanjjanaa Galrani's Give Clarification About Her Controversy In 'Dandupalya 2' Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu