మద్యం మత్తులో మాజీ ఎమ్మెల్యే కొడుకు హల్చల్.. పబ్బులో టాలీవుడ్ నటితో అసభ్య ప్రవర్తన.. పోలీస్ కేసు

ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు మద్యం సేవించి టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంజనతో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. హైదరాబాద్ లోని శనివారం రాత్రి ఓ పబ్బులో ఎమ్మెల్యే కొడుకు ప్రవర్తించిన తీరుపై సంజన మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

 ఎమ్మెల్వే కొడుకు వీరంగం.. పబ్బులో అమ్మాయిలతో

ఎమ్మెల్వే కొడుకు వీరంగం.. పబ్బులో అమ్మాయిలతో

పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్వే నందీశ్వర్‌గౌడ్‌ కుమారుడు‌ ఆశిష్ గౌడ్‌ శనివారం రాత్రి మాదాపూర్ లోని ఓ పబ్బులో వీరంగం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం సేవించి హల్చల్ చేశాడు. పబ్బులో ఉన్న మహిళలపై అనుచితంగా మాట్లాడుతూ అడ్డొచ్చిన వాళ్ళను చితకబాదాడని తెలుస్తోంది. ఇదే పబ్బులో ఉన్న టాలీవుడ్ నటి సంజనపై ఆయన అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది.

 మాదాపూర్ పోలీసులకు సంజన ఫిర్యాదు

మాదాపూర్ పోలీసులకు సంజన ఫిర్యాదు

ఈ ఉదంతంపై నటి సంజన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి ఆశిష్ ఫుల్లుగా మద్యం సేవించి మాదాపూర్‌లోని హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో హల్‌చల్ చేసినట్టు నటి సంజన తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు అతను తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక, అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించాడని ఆమె పేర్కొంది.

మద్యం మత్తులో వెకిలివేషాలు

మద్యం మత్తులో వెకిలివేషాలు

తన ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చిన ఆశిష్ మద్యం మత్తులో తనను నోటికొచ్చిన బూతులు తిట్టినట్లు పేర్కొంది సంజన. మద్యం మత్తులో ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్‌తో కలిసి హంగామా చేశాడని, వెకిలివేషాలు వేశాడని ఆమె ఆరోపించింది. సంజన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఆశిష్‌ గౌడ్‌పై కేసు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఆశిష్‌ గౌడ్‌పై కేసు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

మద్యం మత్తులో ఆశిష్‌ గౌడ్‌ యువతులను చితకబాదినట్లు తెలుస్తోంది. అడ్డుకున్నవారిపై కూడా ఆశీష్‌ గౌడ్‌తో పాటు ఆయన స్నేహితులు దాడి చేసినట్లు సంజన సహా ఇంకొందరు అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్‌ 354, 354ఏ, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. విచారణలో భాగంగా పబ్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించనున్నారు. ఆశిష్‌ గౌడ్‌పై క్రైమ్‌నంబర్‌ 948/2019 కింద కేసు నమోదు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X