హీరోయిన్‌కు వేధింపులు, ఆకతాయికి ఫ్యాన్స్ ధమ్కీ!
హైదరాబాద్: ఫోన్లు చేసి యువతిని వేధిస్తున్న ఆకతాయిలు అంటూ...ఈ మధ్య తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. ఆకతాయిల వేధింపులు సామాన్య యువతలకు మాత్రమే కాదు...సినిమా వాళ్లకు తప్పడం లేదు. తాజాగా హీరోయిన్ సంజనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. సంజనకు ఇలాంటివి కొత్తేమీ కాదు.
గతంలో పలు సార్లు ఇలాంటి విషయాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది....కానీ ఈ సారి మాత్రం అలా చేయలేదు. సదరు ఆకతాయికి బుద్ది చెప్పడానికి వినూత్నంగా ఆలోచించింది. ఆ పనిని తన అభిమానులకు అప్పజెప్పింది. తనను ఫోన్ చేసి వేదిస్తున్న ఆకతాయి ఫోన్ నెంబర్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది.
దీంతో సంజన అభిమానులు తమ తడాఖా చూపించారు. సదరు ఆకతాయికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. సంజన్ ఫ్యాన్స్ ధమ్కీ ఇవ్వడంతో.......సదరు ఆకతాయి మళ్లీ సంజనకు ఫోన్ చేస్తే ఒట్టు. సంజన ఆలోచన చాలా కొత్తగా, వెరైటీగా, పర్ ఫెక్టుగా ఉంది కదూ. ఆకతాయిల బెడద నుంచి తప్పించుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు సినిమా తారలకు ఇలా కూడా ఉపయోగ పడుతున్నాయన్నమాట.
సంజనకు కేవలం ఆకతాయిల నుండి మాత్రమేకాదు సినిమా నిర్మాతల నుండి కూడా లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. తన కోరిక తీర్చమంటూ వేధించిన ఓ నిర్మాత బండారం సంజన బయట పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె 'సరదా' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు వన్స్ ఎపానె టైం అనే మరో తెలుగు సినిమాకు కూడా ఆమె కమిటైంది.


Click it and Unblock the Notifications












