అన్నా హజారేను లవ్ చేస్తున్న హాట్ సుందరి
కొన్ని సంవత్సరాల నుంచి సినీ ప్రపంచంలో హాట్ సుందరి ఇమేజ్ సొంతం చేసుకుని, తన అందాలతో యువతకు కిర్రెక్కిస్తున్న తార సంజాన. గతంలో ఆమెకు ఎంతో మందితో ఎఫైర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ భామ ఓ 74 ఏళ్ల ముసలాడి ప్రేమలో పడిందట. అతడు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తన సన్నిహితుల వద్ద ప్రకటనల మీద ప్రకటనలు చేస్తుందట. ఆ ముసలాడు ఎవరో కాదు... అవినీతిపై పోరాటం చేస్తున్న గాంధేయ వాది అన్నా హజారే.
హాజరే నిజమైన హీరో, దమ్మున్న మగాడు, పట్టుదలగా ముందుకు సాగుతున్నాడు. ఢిల్లీ పీఠాన్ని షేక్ చేస్తున్నాడు, ఆయనో మోడ్రన్ మహాత్మాగాంధీ, అందుకే అతన్ని ఇష్ట పడుతున్నాను అంటూ తెగ హడావుడి చేస్తోంది.
ఈ సెక్సీ భామ ఆరాటం అంతా.... పబ్లిసిటీ దక్కించుకోవడానికే అని కొత్తగా చెప్పక్కర్లేదు. ఈవిడగారి అత్యుత్సాహంపై హజారు, హజారే మద్దతు దారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











