రజనీకాంత్ తర్వాత టైమ్ సెన్స్ ఉన్న హీరో అతనే
రజనీకాంత్ తరవాత చెప్పిన సమయానికి సెట్‌కి వచ్చే హీరో విజయ్ ఒక్కడే అని ప్రముఖ దర్సకుడు శంకర్ అన్నారు. ఆయన తాజా చిత్రం తెలుగు 'స్నేహితుడు' ఆడియోను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా శంకర్ పై విధంగా స్పందించారు. ఆడియో సీడీని రామ్ చరణ్ తేజ్ ఆవిష్కరించి విదు వినోధ్ చోప్రాకి అందించారు. హిందీ చిత్రం '3 ఇడియట్స్'ని విజయ్, ఇలియానా, శ్రీరామ్, జీవా కాంబినేషన్‌లో తమిళంలో 'నన్బన్', తెలుగులో 'స్నేహితుడు' పేరిట శంకర్ దర్శకత్వంలో జెమిని ఫిలిం సర్క్యూట్ నిర్మించింది. తమిళ్ చిత్రం ఇటీవల విడుదలయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు అందిస్తున్నారు.
శంకర్ మాట్లాడుతూ ... నా పాత సినిమాలన్నీ మర్చిపోయి ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు లేవు. గ్రాఫిక్స్ మాయాజాలం లేదు. మంచి కథ మాత్రం ఉంటుంది. మాతృకలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. మేం కొన్ని జోడించాం అన్నారు. ఇప్పటివరకు నేను రీమేక్‌లు చేయలేదు. కానీ ఈ సినిమాని రీమేక్ చేశానంటే దానికో బలీయమైన కారణం ఉంది. 'రోబో'కి సంబంధించిన ట్రైన్ ఎపిసోడ్‌ని పూనాలో చిత్రీకరిస్తున్నప్పుడు అనుమతి లభించలేదు. రెండో రోజు కూడా పర్మిషన్ వస్తుందో రాదో డౌట్. ఒకవేళ రాకపోతే కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఆ టైమ్‌లో చాలా చికాకుగా ఫీలై ఏదైనా సినిమా చూస్తే బెటర్ అనిపించింది.
పూనాలోని లోనావాలాలో '3 ఇడియట్స్' ఆడుతోంది. సరే చూద్దామని వెళ్లాను. కానీ నా మనసంతా 'రోబో' మీదే. ప్రేక్షకులందరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. నేనొక్కడ్నే సీరియస్‌గా ఉన్నా. ఏంటీ ఇంతగా నవ్వుతున్నారు? అని నేను కూడా సినిమాలోకి ఇన్‌వాల్ అయిపోయాను. అప్పుడర్థమైంది ఆ సినిమా గొప్పతనం. రెండున్నర గంటలపాటు ఎంతో ఆనందాన్ని అనుభవించాను. ఆ ఆనందాన్ని మన దక్షిణాది ప్రేక్షకులకు కూడా అందించాలన్న దృక్పథంతో ఈ సినిమాని రీమేక్ చేశాను. దీని సక్సెస్ క్రెడిట్ మొత్తం రాజ్‌కుమార్ హిరానీకే దక్కుతుంది అన్నారు. అలాగే ఈ చిత్రంకి హారిస్ జైరాజ్ మంచి స్వరాలిచ్చారు. సీతారామశాస్త్రితో పాటలు రాయించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.


Click it and Unblock the Notifications











