twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ సినిమాలు విడుదలయ్యే సంక్రాంతి బరిలో గెలవడం కష్టం:యంగ్ హీరో

    By Nageswara Rao
    |

    ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా అగ్ర హీరోలైన వెంకటేష్ నాగవల్లి, నాగార్జున రగడ చిత్రాలు ఆడియో విడుదల చేసి సినిమా ఎప్పుడెప్పుడు విడుదల చెయ్యాలని తహాతహాలాడుతున్నారు. అంతేకాకుండా రెండు సినిమాల ఆడియోలకు మంచి స్పందన రావడంతో హీరోలు మరియు అభిమానులు కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా వీరితో పాటు రవితేజ మిరపకాయ్ అంటూ తనదైన శైలిలో వస్తున్నాడు. ఐతే ఇప్పుడు ఓచిన్న సమస్య వచ్చిపడింది. వెంకటేష్ నాగవల్లి, నాగార్జున రగడ కోసం రవితేజ మిరపకాయ్ సినిమాని విడుదల తేదీని వాయిదా వేసుకోవాల్సిందిగా కోంతమంది సదరు నిర్మాతకు సూచించారని సమాచారం. ఐతే రవితేజ మాత్రం ఇందుకు ససేమేరా అంటున్నాడని సమాచారం.

    అంతేకాకుండా టాలీవుడ్ లోనాకంటూ ప్యాన్స్ ఉన్నారు. మాఅభిమానులు మాత్రం డిసెంబర్ నెలాఖరున సినిమా విడుదల చేయాల్సిందేనని పట్టుబడుతున్నారని అన్నట్టు సమాచారం. ఇప్పుడైతే ఏసినిమాలు కూడాలేవు కాబట్టి యావరేజ్ గాఉన్నా కూడా మంచి వసూళ్లు రాబట్టవచ్చు. సంక్రాంతికి మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి పోటీని తట్టుకోవడం చాలా కష్టం అవుతుందని అన్నట్లు సమాచారం. రవితేజ సూపర్ పెర్ఫార్మెన్స్, హరీష్ శంకర్ టేకింగ్, తమన్ మ్యూజిక్, రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫి ఈ చిత్రానికి హైలైట్స్ అవుతాయి. మిరపకాయ్ టైటిల్ కి తగినట్టుగానే రవితేజ క్యారెక్టర్ వుంటుంది. సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవుతాయి. బ్యాంకాక్ లో చేసిన క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ గా వుంటుందని అన్నారు. ఇకపోతే ఈసినిమాకు రవితేజకు రవితేజకు జంటగా 'లీడర్" ఫేమ్ రిచా గంగోపాధ్యాయ, వేదం ఫేమ్ దీక్షా సేథ్ నటిస్తున్న విషయం అందిరికి తేలిసిందే. డిసెంబర్ 5న ఆడియో విడుదల చేసి, డిసెంబర్ 23న సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత భావిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X