Chiranjeevi Vs Balakrishna సంక్రాంతి 2025 మహా రచ్చ.. చిరుతో బాలయ్య సినీవార్.. రేసులో నాగార్జున, దిల్ రాజు!

తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విదంగా 2024 సంవత్సరంలో సినిమాల రిలీజ్ అత్యంత వివాదంగా మారింది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్‌ నటించిన సైంధవ్, నాగార్జున అక్కినేని నటించిన నా సామిరంగ, తేజ సజ్జా నటించిన హనుమాన్ చిత్రం మధ్య భారీ పోటీకి తెరలేచింది.

అయితే ఈ సినిమాల థియేటర్లు, స్క్రీన్ల కేటాయింపు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌‌గా మారింది. అయితే వచ్చే సంక్రాంతి అంటే.. 2025 ఇంతకంటే మరింత వైబ్రెంట్‌గా మారే అవకాశం కనిపిస్తుంది. నలుగురు అగ్ర సినీ ప్రముఖులు బరిలోకి వెళ్తున్న వివరాల్లోకి వెళితే..

 Sankranti 2025 Releases: Chiranjeevis Vishwambara Face Off with Balakrishnas Akhanda 2

2025 సంవత్సరంలో సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి, బింబిసార డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్‌లో విశ్వంభర సినిమా సిద్దమవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ తాజాగా సంక్రాంతి పండగా 2024, జనవరి 15వ రోజున జరిగింది. వచ్చే సంక్రాంతి పండుగకు కలుద్దాం అంటూ చిరంజీవి సిగ్నల్ ఇచ్చాడు. దాంతో అభిమానుల్లో మళ్లీ సంక్రాంతి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదుచూసేలా చేశారు.

ఇక సంక్రాంతి 2025 సంవత్సరంలో రిలీజ్ కావడానికి సిద్దంగా ఉన్న చిత్రం అఖండ 2. గతంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ హ్యాట్రిక్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే అఖండ 2. దాంతో చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ తప్పనసరి అయింది.

 Sankranti 2025 Releases: Chiranjeevis Vishwambara Face Off with Balakrishnas Akhanda 2

ఇక సంక్రాంతి బరిలో మూడో సినిమాగా నాగార్జున అక్కినేని నటించే సోగ్గాడే చిన్నినాయన ఫ్రాంఛైజీ సినిమా రెడీ అవుతున్నది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకొన్న టాలీవుడ్ మన్మథుడు మరోసారి హిట్టు కోసం ప్లాన్ చేస్తున్నారు.

 Sankranti 2025 Releases: Chiranjeevis Vishwambara Face Off with Balakrishnas Akhanda 2

తాజా సంక్రాంతికి డిస్టిబ్యూటర్‌గా బరిలోకి దిగిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు వచ్చే ఏడాది పండుగకు శతమానం భవతి సినిమాతో సిద్దమవుతున్నాడు. జాతీయ స్థాయిలో అందుకొన్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా సినిమాను రెడీ చేస్తున్నారు. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి రాబోతుండటంతో సినీ ప్రేక్షకులకు ఓ రకమైన ఆసక్తిని రేపుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X