వెంకి, మహేష్.. ముచ్చటగా మూడోసారి
వెంకటేష్, మహేష్ ఇద్దరూ మూడోసారి బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. మహేష్ బాబు స్టైలిష్ ఎంటర్టైనర్ బిజినెస్ మ్యాన్ తో దూసుకు వస్తూంటే, వెంకటేష్ తన ప్యామిలీ ఎంటర్టైనర్ బాడీగార్డ్ తో పోటీ ఇస్తున్నాడు. గతంలోనూ ఇద్దరూ రెండు సార్లు తలపడ్డారు. వంశీ,జయం మనదేరా చిత్రం సమయంలో వీరిద్దరూ ఒకేసారి రంగంలోకి దిగారు. అప్పుడు జయం మనదేరా చిత్రం హిట్టైంది. మరోసారి అతిధి,తులసిలతో ఇద్దరూ తలపడ్డారు. అప్పుడు తులసి చిత్రం హిట్టైంది. మరి ఈ సారి ఈ ఇద్దరిలో గెలపు ఎవరిని వరిస్తుందో చూడాలి. దానికి తోడు బాడీగార్డ్,బిజినెస్ మ్యాన్ రెండూ బి అనే అక్షరంతో మొదలయ్యేవే. అలాగే రెండు చిత్రాల్లోనూ హీరో డాన్ అవుదామని సిటీకి వస్తాడు.
మహేష్ ముంబైకి డాన్ అవుదామని వస్తే, వెంకటేష్ ..హైదరాబాద్ లో డాన్ అవుదామని వస్తాడు. ఇలా రెండు చిత్రాలు ఇంగ్లీష్ టైటిల్స్ తో దూకుతున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం మహేష్ చిత్రానికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే పండుగకి ఫ్యామిలీలు మాత్రం బాడీగార్డ్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇలా ఇద్దరూ ఎవరి తగ్గ బలాలతో వారు రంగంలోకి దిగుతున్నారు. మరి సంక్రాంతి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











