2012 సినీ సంక్రాంతి విజేత ఖరారు
ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద చిత్రాలు యాక్షన్ సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అవి బిజినెస్ మ్యాన్, బాడీగార్డ్, నిప్పు. అయితే మూడు సినిమాలుపై దేనికి తగ్గ అంచనాలు వాటికే ఉన్నాయి. వీటిలో ఏది విజేత అనేది సంక్రాంతి వెళ్లేదాక చెప్పలేం. కానీ ఈ సంక్రాంతికి మాత్రం విజేత సంక్రాంతి దర్శకుడు ఎస్.ఎస్.తమన్ అంటున్నారు.దానికి కారణం...ఈ మూడు చిత్రాలకు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కావటమే. తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ ఎవరూ అంటే తమన్ అంటున్నారు. సంక్రాంతికి క్రేజ్ తెచ్చుకున్న చిత్రాలు మూడింటికీ ఒకరే సంగీత దర్శకుడు కావటం అంటే మాటలు కాదు కదా కాబట్టి అతని సంక్రాంతి విజేతగా డిక్లేర్ చేసారు.
ఇక చిత్రాల విషయానికి వస్తే..అన్నింటికన్నా ముందుగా మహేష్‌బాబు నటించిన 'ది బిజినెస్‌మేన్' రానుంది. పూరీజగన్నాధ్ ఈ చిత్రాన్ని తనకు, మహేష్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన ప్రోమోలు,ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంతటా క్రేజ్ సంపాదించాయి. ఈ చిత్రంలో డైలాగ్స్ ఎక్కడ విన్నా అవే వినపడుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పోకిరి వంటి హిట్ రావటంతో ఈ సినిమా అదే రేంజ్ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. చాలా కాలం గ్యాప్ తీసుకుని యాక్షన్,సెంటిమెంట్ కలగలిపిన సినిమా బాడీగార్డ్ తో 2012లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే 'బాడీగార్డ్' పాటలు హిట్టయి ఇప్పటికే మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం మళయాళంలో సూపర్ హిట్టైన బాడీగార్డ్ కు రీమేక్ కావటంతో ఈ చిత్రంపై అన్ని వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











