సంక్రాంతి మెగా సూపర్ ఫైట్: రెండు సినిమాలు హిట్ అయినా వాళ్లకు మాత్రం బ్రేక్ రాలేదు.!

By Manoj

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. అదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ హడావిడి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సీజన్‌లో భారీ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ చిత్రం 'అల.. వైకుంఠపురములో' మధ్య భీకరమైన పోరు కనిపించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలూ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఇద్దరి గురించి ప్రత్యేకమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఎవరా ఇద్దరు.? వివరాల్లోకి వెళితే...

రెండూ సూపర్ సక్సెస్

రెండూ సూపర్ సక్సెస్

అటు మెగా అభిమానులు.. ఇటు ఘట్టమనేని ఫ్యాన్స్ ఎదురు చూసిన రోజులు రానే వచ్చేశాయి. అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో', మహేశ్ బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు' ఎన్నో అంచనాల నడుమ విడుదలయ్యాయి. ఈ రెండు మూవీలు సూపర్ సక్సెస్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి.

బన్నీ, మహేశ్ మైలురాయిని దాటేశారు

బన్నీ, మహేశ్ మైలురాయిని దాటేశారు

‘సరిలేరు నీకెవ్వరు' ద్వారా మహేశ్ బాబు, ‘అల.. వైకుంఠపురములో'తో అల్లు అర్జున్ రూ. 100 షేర్‌ను దాటేశారు. ఈ రెండు మూవీలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల ఖాతాలో వంద కోట్ల మైలురాయి వచ్చి చేరింది. అంతేకాదు, రోజులు గడుస్తున్నా.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు.

సరిలేరుతో రీఎంట్రీ ఇచ్చాడు

సరిలేరుతో రీఎంట్రీ ఇచ్చాడు


అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, సంగీత తదితరులు నటించారు. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా ప్రముఖ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత ఇదే తొలి సినిమా.

అల..తో మరోసారి కనిపించాడు

అల..తో మరోసారి కనిపించాడు

ఇక, అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సుశాంత్, నవదీప్, సముద్రఖని, నివేదా పేతురాజ్ సహా ఎంతో మంది ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రలు చేశారు. వీరితో పాటు ప్రముఖ కమెడియన్ సునీల్ కూడా ఓ కీలక రోల్ చేశాడు.

హిట్ అయినా వాళ్లకు మాత్రం బ్రేక్ రాలేదు.!

హిట్ అయినా వాళ్లకు మాత్రం బ్రేక్ రాలేదు.!

అటు బండ్ల గణేష్.. ఇటు సునీల్ తమ తమ సినిమాలపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మహేశ్ సినిమాతో తన రీఎంట్రీని ఘనంగా చాటుకోవాలని చూసిన బండ్ల గణేష్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఆయన నటించిన ఎపిసోడ్ లేచిపోయే ప్రమాదంలో పడింది. ఇక, కమెడియన్‌గా బిజీ అవ్వాలనుకున్న సునీల్‌కు కూడా బ్రేక్ రాలేదన్న టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X